దారుణ ఘటన.. ఢిల్లీలో ఉరికి వేలాడిన రైతు.!
Farmer found hanging at Singhu border. ఢిల్లీ సరిహద్దు ప్రాంతం సింఘు వద్ద దారుణ ఘటన జరిగింది. సాగు చట్టాలకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న వారిలో
By అంజి Published on 10 Nov 2021 9:26 AM GMTఢిల్లీ సరిహద్దు ప్రాంతం సింఘు వద్ద దారుణ ఘటన జరిగింది. సాగు చట్టాలకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న వారిలో ఓ రైతు ఉరికి వేలాడుతూ కనిపించాడు. మృతుడు పంజాబ్‌లోని అమ్రెహ్ జిల్లాకు చెందిన గుర్‌ప్రీత్ సింగ్ అని పోలీసులు తెలిపారు. రైతు సంఘం భారతీయ కిసాన్ యూనియన్‌లో రైతు గుర్‌ప్రీత్ భాగస్తుడని తెలుస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు కుండ్లీ పోలీసులు వెల్లడించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించిన పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు.
ఇటీవల కూడా సింఘు సరిహద్దులో ఇలాంటి తరహా ఘటనే చోటు చేసుకుంది. రైతుల నిరసన తెలుపుతున్న ప్రదేశానికి సమీపంలో రోజు కూలీ పని చేసుకునే లాఖ్‌బీర్ సింగ్ అనే వ్యక్తి దారుణంగా హత్యకు గురయ్యాడు. మృతుడికి ఏ నేర చరిత్రా లేదని, రాజకీయ పార్టీలతో సంబంధం లేదని తెలిపిన పోలీసులు.. పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. గత సంవత్సరం కేంద్ర ప్రభుత్వం మూడు కొత్త సాగు చట్టాలను తీసుకువచ్చింది. అప్పటి నుండి పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాలకు చెందిన రైతులు దేశ రాజధాని ఢిల్లీలో నిరసనలు చేస్తున్నారు. ముఖ్యంగా సింఘు, టిక్రీలో తమ ఆందోళనలను కొనసాగిస్తున్నారు. ఈ నెల 26వ తేదీ వారి నిరసనలకు సంవత్సరం పూర్తవుతుంది. సంవత్సరం పూర్తవుతున్న నేపథ్యంలో రైతులు తమ ఆందోళనలు ఉధృతం చేసే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. శీతకాలం పార్లమెంట్ సమావేశాలు జరిగినన్ని రోజులు శాంతియుతంగా ట్రాక్టర్ ర్యాలీలు చేపట్టేందుకు సిద్ధమయ్యారని సమాచారం.