మాజీ ముఖ్యమంత్రి ప్రకాష్‌ సింగ్‌ బాదల్‌ కన్నుమూత‌

Ex-Punjab CM and Akali Dal patriarch Parkash Singh Badal passes away at 95. శిరోమణి అకాలీదళ్‌ అధినేత, పంజాబ్‌ మాజీ ముఖ్యమంత్రి ప్రకాష్‌ సింగ్‌ బాదల్‌ మంగళవారం కన్నుమూశారు.

By Medi Samrat  Published on  25 April 2023 4:00 PM GMT
మాజీ ముఖ్యమంత్రి ప్రకాష్‌ సింగ్‌ బాదల్‌ కన్నుమూత‌

Ex-Punjab CM Parkash Singh Badal


శిరోమణి అకాలీదళ్‌ అధినేత, పంజాబ్‌ మాజీ ముఖ్యమంత్రి ప్రకాష్‌ సింగ్‌ బాదల్‌ మంగళవారం కన్నుమూశారు. ఆయ‌న‌ చాలా కాలంగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్నారు. మొహాలీలో చికిత్స పొందుతున్న‌ బాదల్‌ మంగళవారం తుది శ్వాస విడిచారు. బాదల్ మ‌ర‌ణ‌వార్త‌ను ఆయన కుమారుడు, పార్టీ అధ్యక్షుడు సుఖ్‌బీర్ సింగ్ బాదల్ తెలిపారు. 95 ఏళ్ల బాదల్ వారం క్రితం శ్వాస తీసుకోవడంలో ఇబ్బందితో మొహాలిలోని ఫోర్టిస్ ఆసుపత్రిలో చేరారు. ఆయ‌న‌ డిసెంబర్ 8వ తేదీ 1927న శ్రీ ముఖ్తార్ సాహిబ్‌లో జన్మించారు. ప్రకాష్ సింగ్ బాదల్ మృతి పట్ల ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా సంతాపం తెలిపారు. పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి సర్దార్ ప్రకాష్ సింగ్ బాదల్ మరణవార్త నాకు చాలా బాధ కలిగించిందని రాఘవ్ చద్దా అన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు, స్నేహితులకు ప్రగాఢ సానుభూతిని తెలియ‌జేశారు.


Next Story