జేఎంఎంకు మాజీ సీఎం చంపాయ్ సోరెన్ రాజీనామా.. బీజేపీలో చేరిక‌కు ముహుర్తం ఫిక్స్‌

జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి చంపాయ్ సోరెన్ బుధవారం న్యూఢిల్లీ నుంచి నేరుగా రాజధాని రాంచీకి చేరుకున్నారు

By Medi Samrat  Published on  28 Aug 2024 8:48 PM IST
జేఎంఎంకు మాజీ సీఎం చంపాయ్ సోరెన్ రాజీనామా.. బీజేపీలో చేరిక‌కు ముహుర్తం ఫిక్స్‌

జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి చంపాయ్ సోరెన్ బుధవారం న్యూఢిల్లీ నుంచి నేరుగా రాజధాని రాంచీకి చేరుకున్నారు. వచ్చిన వెంటనే విలేకరులతో మాట్లాడుతూ.. ఆగస్టు 30వ తేదీ శుక్రవారం లాంఛనంగా బీజేపీలో చేరనున్నట్లు తెలిపారు. దీంతో ఆయన భవిష్యత్ వ్యూహం ఏమిటనే సందేహాలకు తెరపడింది.

రాంచీలోని తన నివాసానికి చేరుకున్న తర్వాత ఆయ‌న‌ జార్ఖండ్ ముక్తి మోర్చాకు రాజీనామా లేఖ‌ను పంపారు. సమాచారం ప్రకారం.. చంపాయ్ సోరెన్ ఏకకాలంలో జార్ఖండ్ ముక్తి మోర్చా, రాష్ట్ర మంత్రివర్గం సభ్యత్వానికి రాజీనామా పంపారు. గురువారం రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఉండ‌గా.. ఆ స‌మావేశానికి ముందే చంపై రాజీనామా చేశారు. మరోవైపు JMM ప్రధాన కార్యదర్శి వినోద్ పాండే.. చంపాయ్‌ను పునరాలోచించాలని కోరారు.

బుధవారం బరాజ్‌మడలో జరిగిన బహిరంగ సభలో నోముందిలోని సరంద ప్రాంతానికి చెందిన జేఎంఎం నాయకులు దఖిల్ హెంబ్రామ్, జును సూరిన్ బీజేపీలో చేరారు. వీరిద్దరికీ మాజీ ఎంపీ, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి గీతాకోడా.. మాజీ ముఖ్యమంత్రి మధుకోడా సమక్షంలో పూలమాల వేసి స్వాగతం పలికారు. జేఎంఎం పార్టీలో ఉంటూ ఉక్కిరిబిక్కిరి అవుతున్నామని.. గ్రౌండ్‌లో జేఎంఎం వర్కింగ్ స్టైల్ భిన్నంగా ఉందని వారిద్దరూ అన్నారు. బీజేపీ క్రమశిక్షణ గల పార్టీ అని వారు పేర్కొన్నారు.

Next Story