మూడు రోజుల కస్టడీకి చందా కొచ్చర్‌, ఆమె భర్త దీపక్‌ కొచ్చర్‌

Ex-ICICI Bank CEO Chanda Kochhar, husband sent to 3-day CBI custody in Videocon loan case. వీడియోకాన్‌ గ్రూప్‌కు బ్యాంకు మంజూరు చేసిన ఋణం, అక్రమాలకు సంబంధించి ఐసీఐసీఐ బ్యాంక్‌ మాజీ సీఈవో చందా కొచ్చర్‌

By Medi Samrat
Published on : 24 Dec 2022 9:15 PM IST

మూడు రోజుల కస్టడీకి చందా కొచ్చర్‌, ఆమె భర్త దీపక్‌ కొచ్చర్‌

వీడియోకాన్‌ గ్రూప్‌కు బ్యాంకు మంజూరు చేసిన ఋణం, అక్రమాలకు సంబంధించి ఐసీఐసీఐ బ్యాంక్‌ మాజీ సీఈవో చందా కొచ్చర్‌, ఆమె భర్త దీపక్‌ కొచ్చర్‌లకు ముంబైలోని ప్రత్యేక కోర్టు శనివారం మూడు రోజుల కస్టడీని విధించింది. చందా కొచ్చర్, ఆమె భర్తను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.

చందా కొచ్చర్, ఆమె భర్త దీపక్ కొచ్చర్ లను సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. వీడియోకాన్ గ్రూప్ కు రుణాలు మంజూరు చేయడంలో అవినీతికి, అవకతవకలకు పాల్పడినట్టు నమోదైన కేసులో వీరిని అదుపులోకి తీసుకున్నారు. ఈ అవినీతి ఆరోపణల నేపథ్యంలోనే 2018లో ఐసీఐసీఐ బ్యాంక్ సీఈవో బాధ్యతల నుంచి చందా కొచ్చర్ వైదొలిగారు. బ్యాంక్ సీఈవో హోదాలో 2012లో వీడియోకాన్ గ్రూప్ కు రూ. 3,250 కోట్ల రుణాన్ని చందా కొచ్చర్ మంజూరు చేశారు. చందా కొచ్చర్‌ పదవిలో ఉన్న సమయంలో వీడియోకాన్ గ్రూప్ ఆఫ్ కంపెనీలకు మోసపూరితంగా రుణం పంపిణీ చేశారనే ఆరోపణలపై ఈ అరెస్టు జరిగింది. క్విడ్ ప్రోకోగా, ఆమె భర్త దీపక్ కొచ్చర్ కంపెనీ 'న్యూపవర్ రెన్యూవబుల్' వీడియోకాన్ గ్రూప్ నుండి పెట్టుబడిని పొందింది.


Next Story