ట్విట్ట‌ర్ బ్లూ టిక్ కోసం కోర్టును ఆశ్ర‌యించిన రిటైర్డ్ ఐపీఎస్ అధికారి.. రూ.10వేల జ‌రిమానా

Ex-CBI director moves high court for Twitter’s verified badge. సీబీఐకి తాత్కాలిక‌ డైరెక్ట‌ర్‌గా ప‌నిచేసిన రిటైర్డ్ ఐపీఎస్ అధికారి మ‌న్నెం నాగేశ్వ‌ర‌రావుకు

By Medi Samrat  Published on  17 May 2022 5:02 PM IST
ట్విట్ట‌ర్ బ్లూ టిక్ కోసం కోర్టును ఆశ్ర‌యించిన రిటైర్డ్ ఐపీఎస్ అధికారి.. రూ.10వేల జ‌రిమానా

సీబీఐకి తాత్కాలిక‌ డైరెక్ట‌ర్‌గా ప‌నిచేసిన రిటైర్డ్ ఐపీఎస్ అధికారి మ‌న్నెం నాగేశ్వ‌ర‌రావుకు ఢిల్లీ హైకోర్టు జ‌రిమానా విధించింది. త‌న ట్విట్ట‌ర్ హ్యాండిల్‌కు ఉన్న బ్లూ మార్క్‌ను ఆ సంస్థ యాజ‌మాన్యం తొలగించింద‌ని, బ్లూ టిక్‌ను పునరుద్ధ‌రించేలా ట్విట్ట‌ర్‌కు ఆదేశాలు జారీ చేయాలంటూ గ‌తంలోనే నాగేశ్వ‌ర‌రావు ఢిల్లీ హైకోర్టును ఆశ్ర‌యించారు. ఆయన అనుకున్నది అవ్వకపోవడంతో మ‌రోసారి ఢిల్లీ హైకోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేశారు. ఈ పిటిష‌న్‌పై మంగ‌ళ‌వారం దృష్టి సారించిన ఢిల్లీ హైకోర్టు పిటిష‌న్‌పై విచార‌ణ‌కు నిరాక‌రించింది. ఒకే అంశంపై వ‌రుస‌గా రెండు సార్లు ఫిర్యాదు చేస్తారా? అంటూ నాగేశ్వ‌ర‌రావుపై అస‌హ‌నం వ్య‌క్తం చేయడమే కాకుండా.. ఆయ‌న‌కు రూ.10వేల జ‌రిమానాను విధించింది. ఇక నాగేశ్వ‌ర‌రావు ట్విట్ట‌ర్ హ్యాండిల్‌కు బ్లూ టిక్‌ను పున‌రుద్ధ‌రించాలంటూ ట్విట్ట‌ర్‌కు కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

గత నెలలో ట్విట్టర్‌ను సంప్రదించేందుకు అవకాశం ఇచ్చినప్పటికీ నాగేశ్వ‌ర‌రావు మళ్లీ కోర్టుకు వచ్చారని జస్టిస్ యశ్వంత్ వర్మ తెలిపారు. "మేము ఏప్రిల్ 7న ఒక ఆర్డర్‌ని ఆమోదించాము. మళ్లీ కోర్టును ఎందుకు ఆశ్రయించారు? మీ క్లయింట్‌కు చాలా ఖాళీ సమయం ఉన్నట్లు కనిపిస్తోంది. మా నుంచి రిటర్న్ గిఫ్ట్ కావాలా" అని ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏప్రిల్ 7న కోర్టు ఆదేశాలను అనుసరించి గత నెలలో రావు బ్లూ బ్యాడ్జ్ కోసం మళ్లీ దరఖాస్తు చేసుకున్నారు. ట్విటర్ బ్యాడ్జ్‌ను పునరుద్ధరించలేదని ఆయన మళ్లీ కోర్టును ఆశ్రయించారు.












Next Story