బీజేపీ అధికార ప్రతినిధి నూపుర్ శర్మ మహ్మద్ ప్రవక్తపై చేసిన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగి సస్పెన్షన్‌కు గురైన విషయం తెలిసిందే. ఈ విషయంలో నూపుర్ శర్మకు ఎంఎన్‌ఎస్ చీఫ్ రాజ్ థాకరే మంగళవారం మద్దతుగా నిలిచారు. రాజ్ థాకరే మాట్లాడుతూ.. "అందరూ నూపుర్ శర్మ క్షమాపణ చెప్పాలని కోరారు. నేను ఆమెకు మద్దతు ఇస్తాను. ఆమె చెప్పినది ఇంతకు ముందు డాక్టర్ జాకీర్ నాయక్ చెప్పారు. నాయక్ నుండి ఎవరూ క్షమాపణలు అడగలేదని అన్నారు.
ఒక టీవీ చర్చ సందర్భంగా ప్రవక్తపై నూపుర్ శర్మ చేసిన వ్యాఖ్య దేశవ్యాప్తంగా నిరసనలకు దారితీసింది. గల్ఫ్ దేశాల నుండి తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమైంది. దీంతో బీజేపీ ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. ఆగస్టు 10న, నూపుర్ శర్మపై దేశవ్యాప్తంగా నమోదైన ఎఫ్‌ఐఆర్‌లన్నింటినీ కలిపి సుప్రీం కోర్టు ఢిల్లీ పోలీసులకు బదిలీ చేసింది. గత నెల, ఆమెపై దాఖలు చేసిన ఎఫ్‌ఐఆర్‌లకు సంబంధించి ఆగస్టు 10 వరకు అరెస్టు చేయకుండా సుప్రీంకోర్టు మధ్యంతర రక్షణను మంజూరు చేసింది. హిందూ దేవుళ్లను, దేవతలను అవమానించారంటూ ఏఐఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీపై కూడా రాజ్ ఠాక్రే మండిపడ్డారు.