నేడు మంత్రులుగా ప్ర‌మాణ‌స్వీకారం చేయ‌నున్న ప‌ద‌కొండు మంది ఎమ్మెల్యేలు

Eleven MLAs in Tripura to take oath as cabinet ministers today. బిజెపికి చెందిన తొమ్మిది మంది, ఇండిజినస్ పీపుల్స్ ఫ్రంట్ ఆఫ్ త్రిపుర (ఐపిఎఫ్‌టి) పార్టీకి

By Medi Samrat  Published on  16 May 2022 8:23 AM IST
నేడు మంత్రులుగా ప్ర‌మాణ‌స్వీకారం చేయ‌నున్న ప‌ద‌కొండు మంది ఎమ్మెల్యేలు

బిజెపికి చెందిన తొమ్మిది మంది, ఇండిజినస్ పీపుల్స్ ఫ్రంట్ ఆఫ్ త్రిపుర (ఐపిఎఫ్‌టి) పార్టీకి చెందిన ఇద్దరు మొత్తం పదకొండు మంది ఎమ్మెల్యేలు.. సోమవారం త్రిపుర క్యాబినెట్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఐపిఎఫ్‌టికి చెందిన మేవర్ కుమార్ జమాటియా మినహా బిప్లబ్ కుమార్ దేబ్ క్యాబినెట్‌లోని మంత్రులందరికీ కొత్త క్యాబినెట్‌లో చోటు లభించిందని ఒక అధికారి తెలిపారు.

బిప్లబ్ కుమార్ దేబ్ ప్రభుత్వంలో గిరిజన సంక్షేమ శాఖ మంత్రి జమాటియా, ఇండిజినస్ పీపుల్స్ ఫ్రంట్ ఆఫ్ త్రిపుర అధినేత ఎన్‌సి డెబ్బర్మ మధ్య విభేదాలు ఇటీవల తెరపైకి వచ్చాయి. ముఖ్యమంత్రి మాణిక్ సాహా, మాజీ ముఖ్యమంత్రి బిప్లబ్ కుమార్ దేబ్, ఇతర ప్రముఖుల సమక్షంలో రాజ్‌భవన్‌లో జరిగే కార్యక్రమంలో ఎమ్మెల్యేల‌తో గవర్నర్ ఎస్ఎన్ ఆర్య ప్రమాణ స్వీకారం చేయిస్తారు.

జిష్ణు దేవ్ వర్మ, ఎన్‌సి డెబ్బర్మ (ఐపిఎఫ్‌టి), రతన్ లాల్ నాథ్, ప్రణజిత్ సింఘా రాయ్, మనోజ్ కాంతి దేబ్, సంతాన చక్మా, రామ్ ప్రసాద్ పాల్, భగవన్ దాస్, సుశాంత చౌదరి, రామపాద జమాతియా, ప్రేమ్ కుమార్ రియాంగ్ (ఐపిఎఫ్‌టి) రేపు రాష్ట్ర కేబినెట్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తారని కొత్త సీఎం ఆదివారం రాత్రి గవర్నర్‌కు లేఖ రాశారు. త్రిపుర ముఖ్యమంత్రిగా సాహా ఆదివారం రోజు ప్రమాణ స్వీకారం చేశారు.

శనివారం సాయంత్రం అకస్మాత్తుగా బిప్లబ్ దేబ్ సీఎం ప‌ద‌వికి రాజీనామా చేయంతో సాహాకు ముఖ్య‌మంత్రికి ఈ పదవి లభించింది. ఈ కార్య‌క్ర‌మానికి మాజీ ముఖ్యమంత్రి బిప్లబ్ దేబ్, బిజెపి ఎమ్మెల్యేలు, ప‌లువురు ప్ర‌ముఖులు హాజరయ్యారు.























Next Story