పంజాబ్‌లో అధికారం వైపు ఆప్‌.. రికార్డు సృష్టించనున్న కేజ్రీవాల్‌

Election Results 2022 Live Updates.. AAP lead in Punjab. పంజాబ్‌లో అరవింద్ కేజ్రీవాల్‌ నేతృత్వంలోని ఆప్‌ అధికారం చెజిక్కించుకునే దిశగా అడుగులు వేస్తోంది. వెలువడుతున్న

By అంజి  Published on  10 March 2022 6:46 AM GMT
పంజాబ్‌లో అధికారం వైపు ఆప్‌.. రికార్డు సృష్టించనున్న కేజ్రీవాల్‌

పంజాబ్‌లో అరవింద్ కేజ్రీవాల్‌ నేతృత్వంలోని ఆప్‌ అధికారం చెజిక్కించుకునే దిశగా అడుగులు వేస్తోంది. వెలువడుతున్న ఎన్నికల ఫలితాల్లో ఆప్‌ దూసుకుపోతోంది. 117 అసెంబ్లీ స్థానాలున్న పంజాబ్‌ రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు 59 సీట్లు అవసరం ఉంటుంది. అయితే ఇప్పటికే ఆప్‌ 62 స్థానాలతో మ్యాజిక్‌ ఫిగర్‌ను కూడా అధిగమించింది. పంజాబ్‌లో ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీ 37 స్థానాల్లో ఆధిక్యతను కలిగి ఉంది. పంజాబ్‌లోని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ముఖ్యమంత్రి అభ్యర్థి భగవంత్ మాన్ ఇంట్లో సంబరాలు ప్రారంభమయ్యాయి. పంజాబ్‌లో అరవింద్ కేజ్రీవాల్ పార్టీ ముందంజలో దూసుకుపోతోంది. భగవంత్‌ మాన్ స్వయంగా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన ధురి స్థానం నుంచి ముందంజలో ఉన్నారు. మన్ తన సమీప ప్రత్యర్థి మరియు సిట్టింగ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే దల్వీర్ సింగ్ గోల్డీపై ఆధిక్యంలో ఉన్నారు. సంగ్రూర్‌లోని ఆప్ ముఖ్యమంత్రి అభ్యర్థి భగవంత్ మాన్ నివాసంలో అనేక మంది ఆప్ మద్దతుదారులు డ్యాన్స్ చేస్తూ కనిపించారు.

అయితే ఒక ప్రాంతీయ పార్టీ మరో రాష్ట్రంలో కూడా అధికారాన్ని హస్తగతం చేసుకోవడం ఇదే తొలిసారి. ఈ ఘనత అంతా ఆమ్‌ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్‌కే దక్కుతుందనడంలో ఇప్పుడు ఏ మాత్రం అతిశయోక్తి అనిపించడం లేదు. పంజాబ్‌లో ఆప్‌ అధికారంలోకి వస్తే కేజ్రీవాల్‌ రికార్డు సృష్టించనున్నారు. ఆప్‌ ఇప్పటి వరకు ఢిల్లీకి మాత్రమే పరిమితమైంది. ఇప్పుడు పంజాబ్‌లో తన సత్తా చాటుతుండటంతో అందరీ దృష్టి కేజ్రీవాల్‌ వైపు మళ్లింది. పంజాబ్‌లో కేజ్రీవాల్‌ సత్తా చాటితే దేశ రాజకీయాల్లో సైతం మార్పులు చోటు చేసుకునే ఛాన్స్‌ ఉంది. ఇక ఇప్పటికే కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయ పార్టీగా ఆప్‌ కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

కాగా తమ పార్టీ రాష్ట్రంలో తదుపరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఆప్ రాష్ట్ర విభాగం అధిపతి భగవంత్ మాన్ విశ్వాసం వ్యక్తం చేశారు. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య పంజాబ్‌లోని 117 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఓట్ల లెక్కింపు గురువారం ఉదయం ప్రారంభమైంది. మొత్తం 66 స్థానాల్లో 117 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. 93 మంది మహిళలు, ఇద్దరు ట్రాన్స్‌జెండర్లు సహా మొత్తం 1,304 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. 2017 పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలలో, రాష్ట్రంలోని మొత్తం 117 అసెంబ్లీ సెగ్మెంట్లలో 77 స్థానాలను కైవసం చేసుకోవడం ద్వారా కాంగ్రెస్ పదేళ్ల ఎస్‌ఏడీ, బీజేపీ కలయికకు ముగింపు పలికింది.

Next Story