474 పార్టీలను తొలగించిన కేంద్ర ఎన్నికల సంఘం

ఎన్నికల్లో పోటీ చేయని రాజకీయ పార్టీలకు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) షాకిచ్చింది.

By -  Medi Samrat
Published on : 19 Sept 2025 7:14 PM IST

474 పార్టీలను తొలగించిన కేంద్ర ఎన్నికల సంఘం

ఎన్నికల్లో పోటీ చేయని రాజకీయ పార్టీలకు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) షాకిచ్చింది. గత రెండు నెలల వ్యవధిలోనే ఏకంగా 808 రిజిస్టర్ అయి గుర్తింపు లేని రాజకీయ పార్టీల నమోదును రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ ప్రక్రియలో భాగంగా ఆగస్టు 9న తొలి దశలో 334 పార్టీల నమోదును ఈసీ రద్దు చేసింది. రెండో దశ చర్యల్లో భాగంగా, శుక్రవారం మరో 474 పార్టీలను జాబితా నుంచి తొలగించినట్లు ఎన్నికల సంఘం ఒక ప్రకటనలో వెల్లడించింది. గత ఆరేళ్లుగా వరుసగా ఎలాంటి ఎన్నికల్లోనూ పోటీ చేయకపోవడం, ఇతర నిబంధనలను ఉల్లంఘించడమే ఈ నిర్ణయానికి కారణమని తేల్చింది. తాజాగా తీసుకున్న చర్యలతో కలిపి మొత్తం తొలగించిన పార్టీల సంఖ్య 808కి చేరింది.

Next Story