ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో కీల‌క ప‌రిణామం

ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ వ్యవహారానికి సంబంధించి మనీలాండరింగ్ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు సంజయ్ సింగ్‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) రూస్ అవెన్యూ కోర్టులో చార్జ్ షీట్ దాఖలు చేసింది.

By Medi Samrat  Published on  2 Dec 2023 10:37 AM GMT
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో కీల‌క ప‌రిణామం

ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ వ్యవహారానికి సంబంధించి మనీలాండరింగ్ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు సంజయ్ సింగ్‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) రూస్ అవెన్యూ కోర్టులో చార్జ్ షీట్ దాఖలు చేసింది. సంజయ్‌ను 2023 అక్టోబర్‌లో ఈడీ అరెస్టు చేసింది. అప్పటి నుంచి ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ తీహార్ జైలులో ఉన్నారు.

నవంబర్ 24న సంజయ్ సింగ్‌ను కోర్టులో హాజరుపరిచారు. విచారణ సందర్భంగా ఆయన కస్టడీని కోర్టు మరోసారి పొడిగించింది. డిసెంబర్ 4 వరకూ కస్టడీని పొడిగిస్తున్న‌ట్లు వెల్ల‌డించింది. అంతకుముందు నవంబర్ 10న సంజయ్ సింగ్‌ను 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి కోర్టు పంపింది. సంజయ్ సింగ్ బెయిల్ కోసం రూస్ అవెన్యూ కోర్టు, ఢిల్లీ హైకోర్టు, సుప్రీం కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు.అయినా ఇప్పటివరకు ఆయ‌న‌కు బెయిల్ మంజూరు కాలేదు.

రద్దు చేయబడిన ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ 2021-22ని సవరించేటప్పుడు అవకతవకలు జరిగాయని, లైసెన్స్ హోల్డర్‌లకు అనవసరమైన ప్రయోజనాలు విస్తరించబడ్డాయని సీబీఐ ఎఫ్ఐఆర్ న‌మోదుచేసింది. విధాన రూపకల్పన, అమలులో సంజయ్ సింగ్ కీలక పాత్ర పోషించారని.. దీని వల్ల కొంతమంది మద్యం తయారీదారులు, టోకు వ్యాపారులకు ప్రయోజనం చేకూర్చినట్లు ఆరోపణలు వచ్చాయి. అరెస్టు అనంతరం కింది కోర్టు సింగ్‌ను ఈడీ కస్టడీకి పంపింది.

Next Story