అండర్ వరల్డ్‌కు సంబంధించిన మనీలాండరింగ్ కేసు.. హసీనా పార్కర్ నివాసంలో సోదాలు..

ED conducts searches in Mumbai in underworld-linked action. దావూద్ ఇబ్రహీంపై మనీలాండరింగ్ కేసులో ముంబైలో ఈడీ అధికారులు మంగళవారం

By Medi Samrat  Published on  15 Feb 2022 2:02 PM IST
అండర్ వరల్డ్‌కు సంబంధించిన మనీలాండరింగ్ కేసు.. హసీనా పార్కర్ నివాసంలో సోదాలు..

దావూద్ ఇబ్రహీంపై మనీలాండరింగ్ కేసులో ముంబైలో ఈడీ అధికారులు మంగళవారం దాడులు చేశారు. దావూద్ ఇబ్రహీంపై మనీలాండరింగ్ కేసును ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విచారిస్తోంది. పరారీలో ఉన్న దావూద్ ఇబ్రహీంపై ఇటీవల నమోదైన కేసుకు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ముంబై సమీప ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తోంది. ఈడీ దాడుల్లో మహారాష్ట్రకు చెందిన ఓ రాజకీయ నాయకుడు కూడా ఉన్నారు. దావూద్ ఇబ్రహీం సోదరి దివంగత హసీనా పార్కర్ నివాసంలో ఈడీ అధికారులు సోదాలు జరిపారు.

అండర్ వరల్డ్‌కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో విచారణకు సంబంధించి ఈడీ ముంబైలో ఒకరిని అదుపులోకి తీసుకుంది. మనీలాండరింగ్ కేసుకు సంబంధించి ముంబైలోని దావూద్ ఇబ్రహీం సోదరి హసీనా పార్కర్ నివాసంలో కూడా ఈడీ దాడులు నిర్వహించింది. మహారాష్ట్ర రాజధాని నగరంలో దాదాపు పది ప్రదేశాలలో సోదాలు నిర్వహిస్తున్నారు. మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA) సెక్షన్ల కింద ఈ సోదాలు నిర్వహిస్తున్నారు. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) ఇటీవల దాఖలు చేసిన FIR ఆధారంగా ED ఈ చర్యలు చేపట్టింది. ముంబై పేలుళ్ల సూత్రధారి, పరారీలో ఉన్న గ్యాంగ్‌స్టర్ దావూద్ ఇబ్రహీంకు సంబంధించి కొన్ని నిఘా సంస్థలకు ఇన్‌పుట్‌లు అందాయని తెలుస్తోంది.

ముంబయి అండర్‌వరల్డ్‌తో ముడిపడి ఉన్న హవాలా, దోపిడీ, అక్రమ ఆస్తుల లావాదేవీలకు సంబంధించిన ఆధారాల కోసం మనీలాండరింగ్ నిరోధక సంస్థ వెతుకుతోంది. ఈ చీకటి ఒప్పందాలకు కొన్ని రాజకీయ లింకులు కూడా ఏజెన్సీ యొక్క రాడార్ కింద ఉన్నాయని అధికారులు చెప్పారు.


Next Story