ఢిల్లీలో భూ ప్రకంపనలు..రిక్టర్‌ స్కేల్‌పై 4.1గా నమోదు

దేశ రాజధాని ఢిల్లీ, ఎన్‌సీఆర్‌ సహా పలు ప్రాంతాల్లో గురువారం ఉదయం భూప్రకంపనలు సంభవించాయి.

By Knakam Karthik
Published on : 10 July 2025 10:12 AM IST

National News, Delhi, Earthquake, DelhiEarthquake

ఢిల్లీలో భూ ప్రకంపనలు..రిక్టర్‌ స్కేల్‌పై 4.1గా నమోదు

దేశ రాజధాని ఢిల్లీ, ఎన్‌సీఆర్‌ సహా పలు ప్రాంతాల్లో గురువారం ఉదయం భూప్రకంపనలు సంభవించాయి. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురై ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. రిక్టర్‌ స్కేలుపై భూకంప తీవ్రత 4.1గా నమోదైంది. హరియాణాలోని రేవారి జిల్లాలో ఓ గురుద్వారా సమీపంలో భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు. రాజస్థాన్‌, ఉత్తర్‌ప్రదేశ్‌ సహా పలు రాష్ట్రాల్లో స్వల్ప ప్రకంపనలు వచ్చాయి.

భూకంప కేంద్రం హర్యానాలో ఉన్నప్పటికీ, దాని ప్రభావం ఢిల్లీ, నోయిడా, గురుగ్రామ్, ఘజియాబాద్ వంటి జాతీయ రాజధాని ప్రాంతం అంతటా స్పష్టంగా కనిపించింది. కొన్ని సెకన్ల పాటు భూమి బలంగా కంపించడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఇళ్లు, కార్యాలయాల్లో ఉన్నవారు ఏం జరుగుతుందో తెలియక ఆందోళనతో బయటకు పరుగులు తీశారు.

Next Story