బారాముల్లాలో భూకంపం

జమ్మూకశ్మీర్‌లోని బారాముల్లా జిల్లాలో భూకంపం సంభవించింది. ఉత్తర కాశ్మీర్‌లోని బారాముల్లా జిల్లాలో మధ్యాహ్నం 12.26 గంటలకు భూకంపం వ‌చ్చింది.

By Medi Samrat  Published on  12 July 2024 3:54 PM IST
బారాముల్లాలో భూకంపం

జమ్మూకశ్మీర్‌లోని బారాముల్లా జిల్లాలో భూకంపం సంభవించింది. ఉత్తర కాశ్మీర్‌లోని బారాముల్లా జిల్లాలో మధ్యాహ్నం 12.26 గంటలకు భూకంపం వ‌చ్చింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 4.1గా నమోదైంది. భూకంప కేంద్రం ఉపరితలానికి 10 కిలోమీటర్ల లోతులో ఉంది. జాతీయ భూకంప శాస్త్ర కేంద్రం ఈ వివరాలను వెల్లడించింది. ప్రస్తుతం దీని వల్ల ఎలాంటి నష్టం వాటిల్లినట్లు సమాచారం అందలేదు.

ఈ తెల్లవారుజామున లడఖ్‌లోని లేహ్‌లో తెల్లవారుజామున 2:02 గంటలకు భూకంపం సంభవించింది. లేహ్‌లో భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.6గా నమోదైంది. ఇక్కడ కూడా ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం లేదు.

Next Story