అండమాన్ నికోబార్ దీవుల్లో 4.1 తీవ్రతతో భూకంపం

Earthquake Of Magnitude 4.1 Hits Nicobar Island. భారతదేశంలోని అండమాన్ నికోబార్ దీవుల్లో ఆదివారం భూకంపం సంభవించింది.

By Medi Samrat  Published on  9 April 2023 8:15 PM IST
అండమాన్ నికోబార్ దీవుల్లో 4.1 తీవ్రతతో భూకంపం

Earthquake Of Magnitude 4.1 Hits Nicobar Island


భారతదేశంలోని అండమాన్ నికోబార్ దీవుల్లో ఆదివారం భూకంపం సంభవించింది. నికోబార్ దీవుల్లో మధ్యాహ్నం 2:59 గంటల ప్రాంతంలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 4.1 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. భూకంపం కారణంగా ఎలాంటి ప్రాణనష్టం లేదా నష్టం జరిగినట్లు ఇంకా తెలియలేదు. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ ప్రకారం భూకంపం 10 కి.మీ లోతులో సంభవించింది. "Earthquake of Magnitude:4.1, Occurred on 09-04-2023, 14:59:46 IST, Lat: 9.01 & Long: 94.18, Depth: 10 Km , Nicobar island," నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ ట్వీట్ చేసింది.

ఏప్రిల్ 6 న అండమాన్ నికోబార్ దీవులలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 4.6గా నమోదైంది. పోర్ట్ బ్లెయిర్‌కు 140 కి.మీ దూరంలో భూకంపం సంభవించింది. భూకంపం వల్ల ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.


Next Story