మధ్యప్రదేశ్‌లో భూకంపం.. పరుగులు తీసిన ప్రజలు

Earthquake of magnitude 3.5 strikes Madhya Pradesh. మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలోని బర్వానీ జిల్లాలోని సెంద్వా పట్టణంలో గురువారం తెల్లవారుజామున భూకంపం

By అంజి  Published on  24 Feb 2022 9:51 AM GMT
మధ్యప్రదేశ్‌లో భూకంపం.. పరుగులు తీసిన ప్రజలు

మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలోని బర్వానీ జిల్లాలోని సెంద్వా పట్టణంలో గురువారం తెల్లవారుజామున భూకంపం సంభవించింది. ఈ ప్రాంతంలో రిక్టర్ స్కేలుపై 3.5 తీవ్రతతో భూకంపం వచ్చినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ వెల్లడించింది. సమాచారం ప్రకారం.. ఉదయం 4:53 గంటలకు 5 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించింది. ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని జిల్లా కలెక్టర్ శివరాజ్ సింగ్ వర్మ తెలిపారు. "భూకంప కేంద్రం సెంద్వా నుండి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఖర్గోన్ జిల్లాలోని బిజ్‌గర్హిలో ఉన్నట్లు భావిస్తున్నారు" అని సెంద్వా తహసీల్దార్ మనీష్ పాండే తెలిపారు. మోతీబాగ్, రామ్‌కటోరా, మహావీర్ కాలనీతో సహా వివిధ ప్రాంతాలలో ఉదయం 4.53 గంటలకు బర్వానీకి 65 కిలోమీటర్ల దూరంలో ఉన్న సెంద్వా పట్టణంలో భూకంపం సంభవించింది. ప్రజలు భయాందోళనలతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.

"భారతదేశంలోని మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు 125 కిమీ దూరంలో గురువారం తెల్లవారుజామున 04:53 గంటలకు 3.5 తీవ్రతతో భూకంపం సంభవించింది" అని ఎన్‌ఎస్‌సీ ఒక ట్వీట్‌లో తెలిపింది. మరోవైపు గురువారం ఉదయం పలు ప్రాంతాల్లో కూడా ప్రకంపనలు వచ్చాయి. ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ఇళ్లలోని గృహోపకరణాలు అల్మారా నుండి పడిపోయాయి. వంటగది పాత్రలు నేలపై కిందపడ్డాయి. మోతీబాగ్ ప్రాంతానికి చెందిన మత్లూబ్ ఖాన్ మాట్లాడుతూ 'కుండే కి నియాజ్' స్థానిక ఈవెంట్ కారణంగా.. ముస్లిం మహిళలు రాత్రంతా వంటలు వండుతున్నారని, చాలా మంది ప్రజలు భూకంపాన్ని ప్రత్యక్షంగా అనుభవించారని చెప్పారు.

Next Story