Video : జమ్మూ కాశ్మీర్‌లో భూకంపం.. ఇళ్లలోంచి ప‌రుగులు తీసిన జ‌నం

జమ్మూకశ్మీర్‌లో మరోసారి భూకంపం సంభవించింది. భూకంప స‌మ‌యంలో పూంచ్ లో నివ‌సిస్తున్న‌ ప్రజల ఇళ్ల‌ల్లో ఉన్న వస్తువులు అద‌ర‌డంతో భయాందోళనలకు గురయ్యారు.

By Medi Samrat
Published on : 19 April 2025 3:10 PM IST

Video : జమ్మూ కాశ్మీర్‌లో భూకంపం.. ఇళ్లలోంచి ప‌రుగులు తీసిన జ‌నం

జమ్మూకశ్మీర్‌లో మరోసారి భూకంపం సంభవించింది. భూకంప స‌మ‌యంలో పూంచ్ లో నివ‌సిస్తున్న‌ ప్రజల ఇళ్ల‌ల్లో ఉన్న వస్తువులు అద‌ర‌డంతో భయాందోళనలకు గురయ్యారు. దీంతో ఇళ్ల నుండి బయటకు ప‌రుగులు తీశారు. మధ్యాహ్నం 12.17 గంటలకు భూకంపం సంభవించినట్లు సమాచారం. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 5.9గా నమోదైంది. మూడు రోజుల క్రితం కూడా జమ్మూ కాశ్మీర్‌లో భూకంపం సంభవించింది. భూకంపం కారణంగా ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం లేదు.

దీంతో పాటు పాకిస్థాన్ భూభాగంలో కూడా భూకంపం సంభవించింది. శనివారం ఇక్కడ 5.9 తీవ్రతతో భూకంపం సంభవించింది, అయితే ఇప్పటి వరకు ప్రాణ, ఆస్తి నష్టానికి సంబంధించిన స‌మాచారం అంద‌లేదు. నేషనల్ సిస్మోలాజికల్ మానిటరింగ్ సెంటర్ ప్రకారం.. భూకంప కేంద్రం ఆఫ్ఘనిస్తాన్-తజికిస్తాన్ సరిహద్దు ప్రాంతానికి సమీపంలో 94 కిలోమీటర్ల లోతులో ఉంది. ఇస్లామాబాద్, లాహోర్, పెషావర్, రావల్పిండి, ఖైబర్ ఫఖ్తున్ఖ్వాలోని వివిధ ప్రాంతాలలో భూకంపం సంభవించింది.

అంతకుముందు ఏప్రిల్ 16న జమ్మూ కాశ్మీర్‌లోని కిష్త్వార్‌లో కూడా భూకంపం సంభవించింది. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (NCS) ప్రకారం.. కిష్త్వార్ జిల్లాలో 2.4 తీవ్రతతో భూకంపం సంభవించింది.

Next Story