జమ్మూ కాశ్మీర్‌లో భూకంపం

జమ్మూకశ్మీర్‌లో గురువారం భూకంపం సంభవించింది.

By Medi Samrat  Published on  28 Nov 2024 2:16 PM GMT
జమ్మూ కాశ్మీర్‌లో భూకంపం

జమ్మూకశ్మీర్‌లో గురువారం భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.8గా నమోదైంది. భూకంపాన్ని దగ్గరగా చూస్తే.. ఈ తీవ్రత చాలా ఎక్కువగా ఉంద‌ని నివేదిక‌లు వెల్ల‌డించాయి. అయితే భూకంపం కారణంగా ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం లేదు. సాయంత్రం 4.19 గంటలకు భూకంపం నమోదైనట్లు అధికారులు తెలిపారు. భూకంపం కేంద్రం ఆఫ్ఘనిస్తాన్‌లో 165 కిలోమీటర్ల లోతులో 36.49 డిగ్రీల ఉత్తర అక్షాంశం, 71.27 డిగ్రీల తూర్పు రేఖాంశం వ‌ద్ద కేంద్రీకృత‌మైవుంది.

ఇప్పటి వరకు కశ్మీర్ లోయలో ఎక్కడా ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్లు ఎలాంటి వార్తలు రాలేదని అధికారులు తెలిపారు. దాదాపు నెల రోజుల క్రితం జమ్మూకశ్మీర్‌లోని దోడాలో భూకంపం సంభవించింది. ఆ సమయంలో జమ్మూలో భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 4గా నమోదైంది. జమ్మూ కాశ్మీర్‌తో పాటు నాగాలాండ్‌లో కూడా భూకంపం సంభవించింది. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ నివేదిక ప్రకారం.. గురువారం నాగాలాండ్‌లోని కిఫిర్‌లో 3.8 తీవ్రతతో భూకంపం సంభవించింది. NCS ప్రకారం.. భూకంపం గురువారం ఉదయం 7:22 గంటలకు నమోదైంది. భూకంప‌ కేంద్రం కిఫిర్ ప్రాంతంలో 65 కి.మీ లోతులో ఉంది.

Next Story