రేంజ్ రోవర్ ఎస్‌యూవీ వాహనం ఢీకొనడంతో ఓ వ్యక్తి మృతి చెందగా, అతని భార్య, కుమార్తెకు గాయాలయ్యాయి. హర్యానా రాష్ట్రంలో జాతీయ రహదారిపై ఈ ఘటన చోటు చేసుకుంది. మద్యం మత్తులో ఉన్న ఇద్దరు యువతులు రేంజ్ రోవర్ కారుతో భీభత్సం సృష్టించారు. అంబాలాలో రోడ్డు పక్కన నిలబడి ఉన్న మరో కారును.. మద్యం మత్తులో ఉన్న యువతి తన కారుతో ఢీకొట్టింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఢిల్లీ-అమృత్‌సర్ జాతీయ రహదారిపై కారు ఢీకొనడంతో మోహిత్ శర్మ అనే 39 ఏళ్ల వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు.
వాహనంలో 9 నెలల పాప ఉన్నట్లు వారు తెలిపారు. కారులో ఉన్న ఇద్దరు బాలికలు మద్యం మత్తులో ఉన్నారని అంబాలా డీఎస్పీ రామ్ కుమార్ పేర్కొన్నారు. మోహిత్ తన భార్య మరియు ఇద్దరు కుమార్తెలతో ప్రయాణిస్తున్నాడు. వారు ఢిల్లీ నుండి హిమాచల్ ప్రదేశ్‌కు వెళ్తున్నారు. వారు గ్రెయిన్ మార్కెట్ మొహ్రా దగ్గరకు చేరుకున్నప్పుడు, జ్యూస్ తాగడానికి ఆగారు. అప్పుడు రేంజ్ రోవర్ వారి వాహనాన్ని వెనుక వైపు నుండి ఢీకొట్టింది. బాధితులను అంబాలా కంటోన్మెంట్ సివిల్ ఆసుపత్రికి తరలించారు. మద్యం మత్తులో అమ్మాయిలు రచ్చ రచ్చ చేశారని పోలీసులు తెలిపారు.