తండ్రికి కిడ్నీ ఇవ్వాలి.. సుప్రీంకోర్టును ఆశ్రయించిన డ్రగ్స్ కేసు నిందితుడు.!

Drugs case accused who wants donate kidney. తండ్రి చికిత్స కోసం ఓ డ్రగ్స్ నిందితుడు సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. అనారోగ్యంతో బాధపడుతున్న తన తండ్రికి

By అంజి  Published on  17 Oct 2021 11:34 AM GMT
తండ్రికి కిడ్నీ ఇవ్వాలి.. సుప్రీంకోర్టును ఆశ్రయించిన డ్రగ్స్ కేసు నిందితుడు.!

తండ్రి చికిత్స కోసం ఓ డ్రగ్స్ నిందితుడు సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. అనారోగ్యంతో బాధపడుతున్న తన తండ్రికి కిడ్నీ ఆపరేషన్‌ చేయాలని సుప్రీంకోర్టుకు తెలిపాడు. తండ్రి కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ శస్త్రచికిత్స కోసం తన కిడ్నీ ఇవ్వాలనుకుంటున్నానని భారత ఉన్నత న్యాయస్థానానికి తెలిపాడు. ఇందుకు తనకు బెయిల్‌ మంజూరు చేయాలని కోరాడు. వాదనలు విన్న అనంతరం బెయిల్‌ ఇవ్వడానికి జస్టిస్‌ ఇందిరా బెనర్జీ, జస్టిస్ జేకే మహేశ్వరితో కూడిన ధర్మాసనం అంగీకరించింది. వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి తీసుకెళ్లాలని పోలీసులను కోర్టు ఆదేశించింది.

ప్రభుత్వ వైద్య కళాశాలలో కిడ్నీ ఆపరేషన్‌కు అనుమతి ఇస్తే నిందితుడు మధ్యప్రదేశ్‌ హైకోర్టులో మధ్యంతర బెయిల్ దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. పిటిషన్‌ను కూడా సానుభూతితో పరిశీలించాలని సుప్రీంకోర్టు సూచించింది. నేరం తీవ్రతను, తండ్రిని చూసుకోవడానికి నిందితుడి తోబుట్టువులు ఉన్నారని ప్రభుత్వం తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. అయితే తండ్రిని చూసుకోవడం, కిడ్నీని దానం చేయడం వేరని సుప్రీంకోర్టు వ్యాఖ్యనించింది. నిందితుడి తండ్రి సంతానం, ముఖ్యంగా పెళ్లిళ్లు చేసుకొని పిల్లలు కలిగిన వారు కిడ్నీ ఇచ్చే అవకాశాలు తక్కువ అని కోర్టు వ్యాఖ్యనించింది.

Next Story