రాష్ట్రపతిగా ఎన్నికైన ద్రౌపది ముర్ము

Droupadi Murmu is India's next President. 15వ రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము ఘన విజయం సాధించారు.

By Medi Samrat  Published on  21 July 2022 8:19 PM IST
రాష్ట్రపతిగా ఎన్నికైన ద్రౌపది ముర్ము

15వ రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము ఘన విజయం సాధించారు. మొదటి గిరిజన రాష్ట్రపతిగా ముర్ము చరిత్ర సృష్టించారు. ఢిల్లీలో రాష్ట్రపతి ఎన్నికల ఓట్ల లెక్కింపు ముగిసింది. ఇందులో ఎన్డీయే అభ్యర్థి ద్రౌపది ముర్ము విజయం సాధించారు. కాగా, విపక్షాల అభ్యర్థి యశ్వంత్‌ సిన్హా ఓటమి చెందారు. 3 రౌండ్లలోనూ ద్రౌపది భారీ ఆధిక్యం లభించింది. ముర్ముకు 2,161 ఓట్లు, యశ్వంత్‌ సిన్హాకు 1,058 ఓట్లు వచ్చాయి. మొదటి రౌండ్‌ నుంచి ద్రౌపది ముర్ము ఆధిక్యంలో ఉండగా, యశ్వంత్‌ సిన్హా వెనుకంజలో ఉంటూ వచ్చారు. ఈ నెల 25న ద్రౌపది ముర్ము రాష్ట్రపతిగా పదవీ స్వీకారం చేయనున్నారు.







Next Story