బిజెపి నేతృత్వంలోని ఎన్‌డిఎ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రిటర్నింగ్ అధికారి పిసి మోడీకి పత్రాల సెట్‌ను అందజేశారు. ముర్ము వెంట కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, పీయూష్ గోయల్, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా ఉన్నారు.
ఈ కార్యక్రమానికి బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు యోగి ఆదిత్యనాథ్, శివరాజ్ సింగ్ చౌహాన్, మనోహర్ లాల్ ఖట్టర్, బీఎస్ బొమ్మై, భూపేంద్ర పటేల్, హిమంత బిస్వా శర్మ, పుష్కర్ సింగ్ ధామి, ప్రమోద్ సావంత్, ఎన్ బీరెన్ సింగ్ లు హాజరయ్యారు.
ఎన్‌డిఎ నేతలతో పాటు, కూటమిలో భాగం కాని వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌కు చెందిన వి విజయసాయిరెడ్డి, బిజెడి నేత సస్మిత్ పాత్ర కూడా ద్రౌపది ముర్ము నామినేషన్‌కు మద్దతుగా పార్లమెంటుకు వచ్చారు. అన్నాడీఎంకే నేత ఓ పనీర్‌సెల్వం, ఎం తంబిదురై, జేడీ-యూకు చెందిన రాజీవ్ రంజన్ సింగ్ కూడా పార్లమెంట్‌కు వచ్చినవారిలో ఉన్నారు. ముర్ము రాష్ట్రపతిగా ఎన్నికైనట్లయితే.. దేశానికి మొదటి గిరిజన అధ్యక్షురాలుగా , రెండవ మహిళగా పదవిలో రికార్డును సొంతం చేసుకుంటారు.