పంజాబ్‌లోని అమృత్‌సర్‌లోని భద్రతా దళం జవాన్లు అజ్నాలా తహసిల్‌లోని పంజ్‌గ్రాహియన్ సరిహద్దు ఔట్‌పోస్ట్ వద్ద డ్రోన్లు పేలుడు పదార్థాలను పడవేయడాన్ని గుర్తించారు. దీంతో ఉగ్ర ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. అప్రమత్తమైన జవాన్లు వెంటనే డ్రోన్‌పై కాల్పులు జరిపారు. అది పాకిస్తాన్ వైపు ఎగిరిపోయింది. సంఘటన జరిగిన వెంటనే, BSF ఏదైనా అనుమానాస్పద కార్యకలాపాల విషయమై ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టింది. రెండు ప్రదేశాలలో పేలుడు పదార్థాలు కనుగొనబడ్డాయి. దీంతో అధికారులు సెర్చ్ ఆపరేషన్ మొదలుపెట్టారు.భారత్‌కు పేలుడు పదార్థాలు, ఆయుధాలు, నగదు, డ్రగ్స్‌ను పంపేందుకు సరిహద్దుల్లోని ఉగ్రవాద సంస్థలు డ్రోన్‌లను క్రమం తప్పకుండా ఉపయోగిస్తాయి. భద్రతా బలగాలు మరింత అప్రమత్తంగా ఉన్నాయి. భారతదేశ సరిహద్దుల వెంబడి డ్రోన్ వ్యతిరేక కార్యకలాపాలను నిర్వహిస్తున్నాయి