అతి త్వరలోనే అందుబాటులోకి కొత్త డ్రగ్
DRDO's 2-DG drug for Covid-19 treatment to be launched next week. భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) కరోనా చికిత్స కోసం
By Medi Samrat Published on 15 May 2021 2:30 PM ISTభారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) కరోనా చికిత్స కోసం ఔషధాన్ని తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. దీని పేరు 2 డీఆక్సీ డి గ్లూకోజ్... సంక్షిప్తంగా '2-డీజీ' అంటారు. 2-డీజీ ఔషధానికి భారత ఔషధ నియంత్రణ సంస్థ (డీసీజీఐ) అత్యవసర వినియోగ అనుమతులు మంజూరు చేసింది. పౌడర్ రూపంలో ఉండే సాచెట్‌ను తాజాగా విడుదల చేసింది. 10వేల మోతాదుల మొదటి బ్యాచ్‌ను ఈ వారంలో అందుబాటులోకి తీసుకురానున్నట్లు డీఆర్డీఓ అధికారులు సంయుక్తంగా వెల్లడించారు. వాటిని కరోనా బాధితులకు ఇవ్వనున్నట్లు తెలిపారు. సాచెట్లలో పొడి రూపంలో దొరుకుతుంది. దీన్ని నీటిలో కరిగించి నోటి ద్వారా తీసుకోవాలి. ఇది వాడిన చాలా మందికి RT-PCR టెస్టుల్లో నెగెటివ్ వచ్చిందని డీఆర్‌డీవో ప్రతినిధులు వివరించారు. అందుకే దీనికి DCGI అనుమతి ఇచ్చింది. ఈ వారం నుండి ఇది అందుబాటులోకి వస్తుండడంతో కరోనా మరణాలు తగ్గే అవకాశాలు ఉంటాయని అధికారులు భావిస్తూ ఉన్నారు.
ఈ ఔషధాన్ని డీఆర్డీవోకు చెందిన ఓ ప్రయోగశాల, ఇన్ స్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ మెడిసిన్ అండ్ అల్లైడ్ సైన్సెస్ (ఇన్మాస్), డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. ఈ ఔషధాన్ని వాడిన కరోనా రోగులు వేగంగా కోలుకుంటున్నట్టు క్లినికల్ ట్రయల్స్ లో తెలిసొచ్చింది. 2-డీజీ ఔషధాన్ని తీసుకున్న రోగులకు ఆక్సిజన్ పై ఆధారపడాల్సిన అవసరం రాలేదని.. ఈ ఔషధంతో చికిత్స పొందిన కరోనా రోగుల్లో చాలామందికి స్వల్పకాలంలోనే ఆర్టీ-పీసీఆర్ టెస్టులో నెగెటివ్ వస్తోందని డీఆర్డీవో తెలిపింది. వైరస్ పెరుగుదలను ఇది కట్టడి చేస్తోందని తెలిపింది. ల్యాబ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ మెడిసిన్ అండ్ అలయ్డ్ సైన్స్ , హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ ఔషధ తయరీ సంస్థ డాక్టర్ రెడ్డీస్ సంయుక్తంగా తయారు చేసిన ఈ ఔషధంపై ఎంతో కాన్ఫిడెంట్ గా ఉన్నాయి. ఔషధం తీసుకున్న తర్వాత కరోనా రోగులు త్వరగా కోలుకుంటున్నారని.. అంతేకాదు మెడికల్ ఆక్సిజన్‌పై ఆధారపడాల్సిన అవసరం లేకుండా చేస్తోందని డీఆర్డీవో వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం భారతదేశంలో ఆక్సిజన్ కోసం ఎంతగా ఇబ్బందులు పడుతూ ఉన్నారో అందరూ చూస్తూ ఉన్నారు. ఈ పరిస్థితిని అధిగమించడానికి '2-డీజీ' ఎంతో కొంత తోడ్పాటును అందిస్తుందని భావిస్తున్నారు. ఇది వాడిన చాలా మందికి RT-PCR టెస్టుల్లో నెగెటివ్ వచ్చిందని డీఆర్‌డీవో ప్రతినిధులు వివరించారు.