వరకట్న వేధింపుల కార‌ణంగా ఆత్మ‌హ‌త్య : సెటిల్మెంట్ కుద‌ర‌ద‌న్న హైకోర్టు

Dowry death case cannot be quashed based on settlement arrived between parties. వరకట్న వేధింపుల కారణంగా భార్య ఆత్మహత్య చేసుకోవడంతో నిందితుడైన భర్తపై

By Medi Samrat
Published on : 23 Dec 2021 4:42 PM IST

వరకట్న వేధింపుల కార‌ణంగా ఆత్మ‌హ‌త్య : సెటిల్మెంట్ కుద‌ర‌ద‌న్న హైకోర్టు

వరకట్న వేధింపుల కారణంగా భార్య ఆత్మహత్య చేసుకోవడంతో నిందితుడైన భర్తపై దాఖలైన ఎఫ్‌ఐఆర్‌ను రద్దు చేసేందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. భార్య వరకట్న వేధింపుల‌ మరణానికి సంబంధించి నమోదైన కేసును నిందితుడు, ఫిర్యాదుదారు మధ్య సెటిల్మెంట్ ఆధారంగా రద్దు చేయలేమని ఢిల్లీ హైకోర్టు పేర్కొంది. ఢిల్లీ హైకోర్టు సింగిల్ జడ్జి జస్టిస్ ముక్తా గుప్తా తీర్పు ప్రకారం.. వరకట్న డిమాండ్ ఒక సామాజిక దురాచారమని, దాని ఫలితంగా మహిళలు చనిపోవడం సమాజానికి నేరం. సెక్షన్ 304-బి ఐపిసి ప్రకారం ఈ నేరం శిక్షార్హమని జస్టిస్ అన్నారు.

భర్త మరియు అతని కుటుంబ సభ్యుల వేధింపుల కారణంగా పెళ్లయిన ఐదు నెలల్లోనే ఒక మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఇది IPC 304-B ప్రకారం శిక్షార్హమైన నేరం. తీవ్రమైన, ఘోరమైన నేరం మాత్రమే కాదు. వరకట్నం డిమాండ్ చేయ‌డ‌మ‌నే సామాజిక దురాచారం వల్ల సమాజంపై దుష్ప్ర‌భావం ప‌డుతుంది. దీనిని నిరోధించ‌డం అవసరం. అందువల్ల నిందితులు, ఫిర్యాదుదారు మధ్య పరిష్కారం ఆధారంగా ఇది రద్దు చేయబడదని ఢిల్లీ హైకోర్టు వ్యాఖ్యానించింది. దల్బీర్ సింగ్ అనే వ్యక్తి, అతని కుటుంబ సభ్యులపై దాఖలైన పిటీషన్‌ను కోర్టు విచారిస్తోంది. కట్నం కోసం తన భార్య ప‌ట్ల‌ అసభ్యంగా ప్రవర్తించడంతో ఆమె ఆత్మహత్యకు పాల్ప‌డింది.

విచారణ కొనసాగుతున్న సమయంలో కుటుంబాలు ఒకరిపై ఒకరికి ఎలాంటి పగలు లేవని పేర్కొంటూ సెటిల్మెంట్ కు ఏర్పాట్లు చేసుకున్నట్లు హైకోర్టుకు నోటీసులు అందాయి. దీంతో వారు ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేయాలని కోర్టును ఆశ్రయించారు. మహిళ ఈ ఏడాది మార్చిలో దల్బీర్ సింగ్‌ను వివాహం చేసుకుంది. అయితే పెళ్లికి ముందు ఆ వ్యక్తి కుటుంబం ఎలాంటి కట్నం డిమాండ్ చేయలేదు. వివాహం జరిగిన వెంటనే.. సింగ్ కుటుంబం మహిళ నుండి కట్నం డిమాండ్ చేయడం ప్రారంభించింది. తమ కుమార్తె ఆత్మహత్య చేసుకుందని మహిళ కుటుంబానికి ఆగస్టు 30న ఫోన్ కాల్ వచ్చింది.


Next Story