ర‌క్త‌దానం చేయండి.. కిలో చికెన్ ఫ్రీగా తీసుకెళ్లండి

Donate blood get 1 kg chicken. ప్రమాదాల్లో గాయప‌డిన వారికి అత్య‌వ‌స‌ర స‌మ‌యాల్లో ర‌క్తం అంద‌క ఎంతో మంది ప్రాణాలు

By Medi Samrat  Published on  7 Dec 2020 8:50 AM GMT
ర‌క్త‌దానం చేయండి.. కిలో చికెన్ ఫ్రీగా తీసుకెళ్లండి

ప్రమాదాల్లో గాయప‌డిన వారికి అత్య‌వ‌స‌ర స‌మ‌యాల్లో ర‌క్తం అంద‌క ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. మీరు చేసే ర‌క్త‌దానం ఎన్నో కుటుంబాల్లో వెలుగులు నింపుతోంది. రక్తదానం చేయటమంటే ఓ మనిషికి పునర్జన్మను ఇచ్చినట్లే. ఈ ర‌క్తాన్ని ప్ర‌యోగ‌శాల్లో సృష్టించ‌లేరు. దీంతో చాలామంది రక్తదానం చేస్తుంటారు. అలా రక్తదానం చేసినవారికి వెంటనే శక్తి రావటానికి ఓ పండు ఇస్తారు. లేదా ఫ్రూట్ జ్యూస్ ఇస్తారు. కానీ మహారాష్ట్రలోని బృహన్ ముంబై కార్పొరేషన్ (MBC) మాత్రం రక్తదానం చేయండి.. కిలో చికెన్ లేదా పన్నీర్ ఫ్రీగా పట్టుకెళ్లండీ అని పిలుపునిస్తోంది.

డిసెంబర్ 16న న్యూ ప్రభాదేవి లేని రాజాభావ్ సాల్వీ మైదాన్‌లో బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహిస్తున్నారు. ఇందులో రక్తం ఇవ్వదలచినవారు... డిసెంబర్ 11 లోపు తమ పేర్లను రిజిస్టర్ చేసుకోవాలని సూచించారు. లోయర్ పారెల్‌లోని KEM ఆస్పత్రి వర్గాలు.. ఈ బ్లడ్ డొనేషన్ ప్రక్రియ సజావుగా జరిగేలా చేయనున్నాయి. ప్రభాదేవీ స్థానం నుంచి BMCకి ప్రాతినిధ్యం వహిస్తున్న కార్పొరేటర్ సమాధాన్ సర్వాంకర్.. తన ఏరియాలోని ప్రజలు ఈ బ్లడ్ డొనేషన్ కార్యక్రమంలో పాల్గొని చికెన్ లేదా పన్నీర్ తీసుకెళ్లాల్సిందిగా కోరారు. తద్వారా నాన్ వెజ్ తినని వారు పన్నీరు తీసుకెళ్లేలా ప్లాన్‌ చేశారు.

ఈ సంద‌ర్భంగా.. సమాధాన్ సర్వాంకర్ మాట్లాడుతూ.. కరోనా కాలంలో రక్తదానం చేస్తే ఇమ్యూనిటీ పెంచుకోవటానికి చికెన్ లేదా పన్నీర్ ను దాతలకు ఇవ్వాలనుకుంటున్నామన్నారు. ప్రజలను రక్తం దానం దిశగా ఎంకరేజ్ చెయ్యాలనుకున్నాం. వాళ్లలో ఒకింత ఆనందం తేవాలనుకున్నాం. ఈ కరోనా సమయంలో ఇలాంటి ఆఫర్లు వారికి ఎంతగానో ఉపయోగపడతాయి అని అన్నారు.




Next Story