విమానాల్లో ప్రయాణించడానికి భయపడుతూ ఉన్నారట

Domestic flyers worried about air safety many avoiding spicejet. విమానయాన సంస్థల్లో ఇటీవల చోటుచేసుకున్న ప్రమాదాలు విమాన ప్రయాణికులను

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  9 July 2022 1:30 PM GMT
విమానాల్లో ప్రయాణించడానికి భయపడుతూ ఉన్నారట

విమానయాన సంస్థల్లో ఇటీవల చోటుచేసుకున్న ప్రమాదాలు విమాన ప్రయాణికులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. లోకల్ సర్కిల్స్ నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం, చాలా మంది విమాన ప్రయాణికులు ఇకపై విమానయానంపై ఎక్కువగా ఆసక్తి చూపడం లేదు. ఇటీవలి సంఘటనల నేపథ్యంలో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) విమానయాన సంస్థలకు నోటీసులు జారీ చేసింది. తాజా సర్వేలో 77% మంది వారి కుటుంబం దేశీయ విమాన ప్రయాణాన్ని చేపట్టేటప్పుడు భద్రత గురించి ఆందోళన చెందుతున్నట్లు అంగీకరించారు. 20 రోజుల కంటే తక్కువ వ్యవధిలో అనేక ప్రమాదాలు సంభవించిన తర్వాత, విమానయాన సంస్థలు విమాన నిర్వహణపై సరిగా దృష్టి పెట్టకపోవడంతో ప్రయాణీకుల భద్రతను ప్రమాదంలో పడేస్తున్నాయని ఆందోళన చెందుతూ ఉన్నారు. జులై 5న వివిధ విమానయాన సంస్థలకు చెందిన మూడు విమానాలు విమానయానానికి యోగ్యం కాదని తేలినందున ఈ ఆందోళన మరింత ఎక్కువవుతోంది.

ఇండిగో, విస్తారా ఎయిర్‌లైన్స్ తమ విమాన కార్యకలాపాల సమయంలో పొగ, ఇంజిన్ షట్ సమస్యలను నివేదించగా, స్పైస్‌జెట్ విమానం సాంకేతిక లోపంతో చైనాకు వెళ్లే విమానాన్ని రద్దు చేసింది. స్పైస్‌జెట్ విషయానికి వస్తే, ఇటీవలి కాలంలో ఎనిమిది సార్లు సాంకేతిక లోపం సంభవించిందనే కథనాలను మనం చూశాం. లోకల్ సర్కిల్స్ ప్రకారం.. దేశీయ మార్గాల్లో ప్రయాణిస్తున్న వారిలో 44% మంది భద్రతా కారణాల దృష్ట్యా స్పైస్‌జెట్ విమానాలలో వెళ్లాలని అనుకోవడం లేదని చెప్పారు, అయితే 21% మంది ఎయిర్ ఇండియా, ఇండిగోలో ప్రయాణాన్ని వద్దనుకుంటున్నామని చెప్పారు. దేశీయ విమాన ప్రయాణికుల్లో 18% మంది గో ఫస్ట్‌కు దూరంగా ఉన్నారని, 6% మంది భద్రతా కారణాల దృష్ట్యా విస్తారాలో ప్రయాణానికి దూరంగా ఉన్నారని, 12% మంది భద్రతా సమస్యల కారణంగా ఎయిర్ ఏషియాలో వెళ్లకూడదని అనుకుంటూ ఉన్నామని చెప్పారు.

విమానంలో ప్రయాణిస్తున్నప్పుడు భద్రత గురించి ఆందోళన కలుగుతోందా అని ప్రశ్నించగా.. 42% మంది ఆందోళన చెందుతున్నారని చెప్పారు. అయితే 35% మంది ఎంపిక చేసిన కొన్ని విమానయాన సంస్థల ద్వారా ప్రయాణాన్ని ప్రారంభిస్తే మాత్రమే ఆందోళన చెందుతున్నామని.. 16% మంది ప్రతివాదులు తాము ఆందోళన చెందడం లేదని చెప్పారు. ఏడు శాతం మంది అభిప్రాయం వ్యక్తం చేయలేదు.

ఆర్థిక సమస్యలు మరియు భద్రతా సమస్యలు

సర్వేలోని తదుపరి ప్రశ్న, వివిధ విమానయాన సంస్థలలో జరిగే అనేక భద్రతా సంఘటనలకు ప్రధాన కారణాలుగా వారు భావించిన విషయాలు ఏమిటంటే.. 46% మంది కొన్ని ఎయిర్‌లైన్స్ ఎదుర్కొంటున్న ఆర్థిక సంక్షోభం కారణంగా ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటూ ఉన్నాయని చెప్పారు. 18% మంది రెగ్యులేటర్ "అసమర్థమైన పర్యవేక్షణ" కారణమని నిందించారు.

బలహీనమైన అంతర్గత మరియు/లేదా బాహ్య భద్రతా ఆడిట్ సిస్టమ్‌లు సమస్యగా మారాయని 15% మంది చెబుతున్నారు. 5% మంది కొన్ని విమానయాన సంస్థలలో సాంకేతిక పరిజ్ఞానం లేకపోవడమే కారణమని చెప్పారు. 10% మంది పేలవమైన నిర్వహణ కారణమని తెలిపారు. మొత్తం 46% మంది ఈ సమస్యలకు కొన్ని ఎయిర్‌లైన్స్‌లోని ఆర్థిక పరిస్థితి కారణమని భావించారు, అయితే 33% మంది బలహీనమైన అంతర్గత, బాహ్య ఆడిట్ సిస్టమ్‌లు.. నియంత్రణ పర్యవేక్షణ దీనికి కారణమని పేర్కొన్నారు.

విమాన భద్రత గురించి ఆందోళన వ్యక్తం చేస్తూ పౌరుల నుండి పెద్ద సంఖ్యలో పోస్ట్‌లు రావడంతో, లోకల్ సర్కిల్స్ ప్లాట్‌ఫారమ్‌తో పాటు వార్తల వెబ్‌సైట్ మనీకంట్రోల్ ఈ అంశంపై జాతీయ సర్వేను నిర్వహించింది. భారతదేశంలోని 302 జిల్లాల్లో ఉన్న 21,000 మంది నుండి ఈ సర్వేకు 45,000 ప్రతిస్పందనలు వచ్చాయి.

























Next Story