ఓమిక్రాన్ రోగులకు ఎలా చికిత్స చేశారో చెప్పిన వైద్యులు
Doctors reveal how they have treated Omicron patients in Delhi. ఢిల్లీలో ఓమిక్రాన్ కేసులు విజృంబిస్తున్నాయి. ఢిల్లీలోని ఎల్‌ఎన్‌జేపీ
By Medi Samrat Published on 24 Dec 2021 2:07 PM GMTఢిల్లీలో ఓమిక్రాన్ కేసులు విజృంబిస్తున్నాయి. ఢిల్లీలోని ఎల్‌ఎన్‌జేపీ హాస్పిటల్‌లో ఇప్పటివరకు 40 ఓమిక్రాన్ వేరియంట్ కేసులు రాగా.. వారిలో 19 మంది ఇప్పటికే డిశ్చార్జ్ అయ్యారు. ఆస్పత్రికి వచ్చిన కేసులలో గొంతు నొప్పి, లో జ్వరం మరియు ఒంటి నొప్పి లక్షణాలు ఎక్కువగా ఉన్నాయని వైద్యులు చెప్పారు. చికిత్స కోసం వారికి మల్టీవిటమిన్లు మరియు పారాసెటమాల్ ఇచ్చామని.. వారికి మరే ఇతర ఔషధం ఇవ్వాల్సిన అవసరం లేదని ఆసుపత్రి సీనియర్ వైద్యుడు తెలిపారు.
దక్షిణాఫ్రికాలో మొదటిసారిగా గుర్తించబడిన SARS-CoV-2 యొక్క తాజా వేరియంట్ అయిన ఓమిక్రాన్ డెల్టా కంటే వేగంగా వ్యాప్తి చెందుతుంది. అయినప్పటికీ అనారోగ్య తీవ్రత తక్కువ కలిగిస్తుంది. మునుపటి రూపాంతరాల వలె కాకుండా, ఊపిరితిత్తులను ప్రభావితం చేయకుండా ఓమిక్రాన్ రోగుల గొంతులో గుర్తించబడుతుంది. అందువల్ల, ఓమిక్రాన్ కేసులకు ఇతర చికిత్స అవసరం లేదని వైద్యులు తెలిపారు.
ఇటీవల కోలుకున్న ఢిల్లీకి చెందిన మొదటి ఓమిక్రాన్ పేషెంట్ కూడా తనకు ఎలాంటి లక్షణాలు లేవని, కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయినప్పుడు నమ్మలేకపోయానని చెప్పాడు. రోహిణికి చెందిన 37 ఏళ్ల వ్యాపారవేత్త తనకు ఎటువంటి లక్షణాలు లేవని.. మొదట్లో హోమ్ ఐసోలేషన్‌లో ఉన్నానని చెప్పారు. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం.. ఢిల్లీలో ఇప్పటివరకు 67 ఓమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. వారిలో 23 మంది డిశ్చార్జ్ అయ్యారు.
క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో ఒమిక్రాన్ వేగంగా వ్యాప్తి చెందుతున్నందున అత్యంత జాగ్రత్తగా ఉండాలని కేంద్రం అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను అప్రమత్తం చేసింది. శుక్రవారం నాటికి భారతదేశంలో 358 ఓమిక్రాన్ కేసులు ఉన్నాయి.