ఒమిక్రాన్ ఎఫెక్ట్‌ : మొబైల్ స్విచ్ ఆఫ్ చేసి అలా చేయ‌కండి..!

Do not switch off mobiles Karnataka minister as foreign nationals go missing. కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ విజృంభిస్తుండ‌టంతో ప్ర‌భుత్వాలు అలెర్ట్ అవుతున్నాయి.

By Medi Samrat  Published on  4 Dec 2021 3:39 AM GMT
ఒమిక్రాన్ ఎఫెక్ట్‌ : మొబైల్ స్విచ్ ఆఫ్ చేసి అలా చేయ‌కండి..!

కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ విజృంభిస్తుండ‌టంతో ప్ర‌భుత్వాలు అలెర్ట్ అవుతున్నాయి. ఈ నేఫ‌థ్యంలోనే బెంగుళూరులో దిగిన తర్వాత విదేశీ పౌరులు జాడ తెలియకుండా పోతున్నారనే నివేదికలపై కర్ణాటక ఆరోగ్య మంత్రి డాక్టర్ కె సుధాకర్ స్పందించారు. ఆ వ్యక్తులను ట్రాక్ చేయడానికి పోలీసులు తగినంత సమర్ధవంతంగా ప‌నిచేస్తున్నార‌ని.. అయితే వారు ఎంచుకున్న‌ది సరైన మార్గం కాదని.. ప్రయాణికులు బాధ్యతగా ప్రవర్తించాలని అన్నారు. ఎవరూ తమ మొబైల్ స్విచ్ ఆఫ్ చేసి జాడ తెలియకుండా ఉండకూడదని.. బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. కర్ణాటకలో రెండు ఒమిక్రాన్ కేసులు నమోదయిన విష‌యం తెలిసిందే.

ఈ నేఫ‌థ్యంలోనే దేశంలోకి ఎంట‌రైన త‌ర్వాత‌ అంతర్జాతీయ ప్రయాణికులు బాధ్య‌తారాహిత్యంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారని నివేదిక‌లు చెబుతున్నాయి. ఈ విష‌య‌మై ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ అఖిలేష్ మోహన్ మాట్లాడుతూ.. కొంతమంది విదేశీ పౌరులు అడ్మినిస్ట్రేష‌న్‌కు తప్పుడు మొబైల్ నంబర్లు, చిరునామాలు ఇచ్చారని చెప్పారు. విదేశాల నుంచి వచ్చిన 297 మందిలో 13 మంది ఇలా చేశారని డాక్టర్ మోహన్ ఏఎన్ఐతో అన్నారు.

దక్షిణాఫ్రికా నుండి తిరిగి వచ్చిన చండీగఢ్‌కు చెందిన‌ ఒక మహిళ గృహ నిర్బంధాన్ని ఉల్లంఘించింది. ఫైవ్ స్టార్‌ హోటల్‌కు వెళ్లడంతో అడ్మినిస్ట్రేష‌న్ అధికారులు ఆమెపై కఠినమైన చర్యలకు ఉప‌క్రమించారు. కొద్దిరోజుల క్రితం బెంగుళూరుకు వ‌చ్చిన‌ దక్షిణాఫ్రికా జాతీయుడికి పాజిటివ్ రావ‌డం.. వారంలోపు అత‌ను దుబాయ్‌కి వెళ్లడంతో.. కర్ణాటక ప్రభుత్వం రాష్ట్రంతో పాటు.. దేశంలోని మొదటి ఒమిక్రాన్ కేసుపై దర్యాప్తునకు ఆదేశించింది. అయితే.. అతని ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్స్ అన్నీ నెగెటివ్ అని తేలడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.


Next Story