ర్యాలీలో ప్రజలపై కరెన్సీ నోట్లను విసిరిన కాంగ్రెస్ నేత‌

DK Shivakumar throws currency notes on people during rally in Mandya. కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ ఎన్నికల ఊరేగింపులో ప్రజలపై డబ్బులు విసిరారు

By Medi Samrat  Published on  28 March 2023 8:10 PM IST
ర్యాలీలో ప్రజలపై కరెన్సీ నోట్లను విసిరిన కాంగ్రెస్ నేత‌

DK Shivakumar during the election rally in Karnataka's Mandya


కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ ఎన్నికల ఊరేగింపులో ప్రజలపై డబ్బులు విసిరారు. దీనికి సంబంధించిన వీడియో కూడా బయటకు వచ్చింది. ఇందులో డీకే శివకుమార్ బస్సుపై కనిపిస్తారు. ఆయనతో పాటు మరికొందరు పార్టీ నేతలు కూడా బ‌స్సుపై ఉన్నారు. ప్ర‌జ‌లు నినాదాలు చేస్తున్నారు. డ‌ప్పు వాయిద్యాలు మోగుతున్నాయి. జెండాలు రెపరెపలాడుతున్నాయి. ఆ స‌మ‌యంలో వాహ‌నంపై ఉన్న‌ డీకే శివకుమార్ కుడివైపుకి తిరిగి నమస్కరించారు. ఆ స‌మ‌యంలో ఆయ‌న‌ చేతిలో చాలా క‌రెన్సీ నోట్లు కనిపిస్తాయి. డీకే శివకుమార్.. బస్సు కింద నిలబడి ఉన్న వ్యక్తుల వైపు చూస్తూ వారిపై క‌రెన్సీ నోట్లను విసిరారు. అనంత‌రం ప్ర‌చార ర‌థం ముందుకు సాగుతుంది.

ఈ సంఘటన కర్ణాటకలోని మాండ్యా జిల్లాకు చెందినది. ఎన్నికల ప్రచారానికి డీకే శివకుమార్ వచ్చారు. డీకే శివకుమార్ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ.. జిల్లాలోని బేవినహళ్లి ప్రాంతం నుంచి 'ప్రజాధ్వని యాత్ర' చేపడుతోంది. అదే సమయంలో డీకే శివకుమార్ ప్రజలపై నోట్లు విసిరారు. ఈ విషయంలో అధికార బీజేపీ స్పందించాల్సివుంది.

డీకే శివకుమార్ కర్నాటక కాంగ్రెస్ అధ్యక్షుడే కాదు.. ఆర్థికంగా కూడా బలంగా ఉన్న రాజ‌కీయ‌ నాయకుడి ఇమేజ్ ఆయ‌న‌కు ఉంది. కర్ణాటకలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీ, కాంగ్రెస్‌లు ఎన్నికల ప్రచారంలో బిజీబిజీగా ఉంటూ పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నాయి. ఎన్నికల నేప‌థ్యంలో డీకే శివకుమార్.. బీజేపీ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టారని సీఎం బసవరాజ్ బొమ్మై ఆరోపించారు. ఈ నేప‌థ్యంలో శివ‌కుమార్ తాజా ఘ‌ట‌న‌పై బీజేపీ నుంచి ఎటువంటి రియాక్ష‌న్ వ‌స్తోందో చూడాలి మ‌రి.



Next Story