రిసార్ట్ రాజకీయాలు ఉండవు.. కాంగ్రెస్ తప్పకుండా గెలుస్తుంది

మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా విజయం సాధిస్తుందన్న నమ్మకం ఉందని, తాము రిసార్ట్ రాజకీయాలను ఆశ్రయించాల్సిన అవసరం లేదని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత డీకే శివకుమార్ అన్నారు.

By Medi Samrat  Published on  23 Nov 2024 3:30 AM GMT
రిసార్ట్ రాజకీయాలు ఉండవు.. కాంగ్రెస్ తప్పకుండా గెలుస్తుంది

మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా విజయం సాధిస్తుందన్న నమ్మకం ఉందని, తాము రిసార్ట్ రాజకీయాలను ఆశ్రయించాల్సిన అవసరం లేదని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత డీకే శివకుమార్ అన్నారు. కర్ణాటకలోని మూడు నియోజకవర్గాల ఉప ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కర్ణాటక లోని చన్నపట్న, సండూర్, షిగ్గావ్ ఉప ఎన్నికల్లో గెలుస్తామని, ఎగ్జిట్ పోల్స్ నిజమవ్వవని తెలిపారు.

తాము రిసార్ట్ రాజకీయాలకు పాల్పడతామని కొన్ని జాతీయ ఛానెల్‌లు కథనాన్ని ప్రసారం చేస్తున్నాయని సమాచారం అందింది.. ఈ విషయమై ఏఐసీసీ నేతలు ఎవరూ తనను సంప్రదించలేదు, చర్చించలేదన్నారు శివ కుమార్. మహారాష్ట్రలోని అనేక నియోజకవర్గాలను సందర్శించాను, కాంగ్రెస్ కూటమి విజయం సాధిస్తుందని బలంగా విశ్వసిస్తున్నానన్నారు. రిసార్ట్ రాజకీయాలకు తావు లేకుండా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని శివకుమార్‌ స్పష్టం చేశారు. మహారాష్ట్రలో హంగ్ అసెంబ్లీ ఏర్పడుతుందన్న అంచనాలపై తమ వద్ద ఎటువంటి ప్రణాళికలు లేవని ఆయన అన్నారు.

Next Story