ముఖ్యమంత్రి శాసన సభ్యత్వం రద్దు..!
Disqualify Hemant Soren As MLA. ఝార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ శాసన సభ్యత్వం రద్దయింది.
By Medi Samrat Published on 26 Aug 2022 7:30 PM ISTఝార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ శాసన సభ్యత్వం రద్దయింది. ఈ మేరకు ఆ రాష్ట్ర గవర్నర్ రమేశ్ బయాస్ శుక్రవారం సోరెన్ శాసన సభ్యత్వాన్ని రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వుల విడుదలతో ఈ క్షణం నుంచే హేమంత్ సోరెన్ సభ్యత్వం రద్దయిపోయినట్లే. తనకు తానుగా గనులను కేటాయించుకున్న హేమంత్ సోరెన్‌పై విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలో హేమంత్ వ్యవహార సరళిపై కేంద్ర ప్రభుత్వానికి గవర్నర్ ఫిర్యాదు చేయడం, ఆ ఫిర్యాదును కేంద్రం ఎన్నికల సంఘానికి పంపింది. హేమంత్ శాసన సభ సభ్యత్వం రద్దుకు ఈసీ సిఫారసు చేయడం, ఈసీ సిఫారసు ఆధారంగా హేమంత్ ఎమ్మెల్యే పదవిని రద్దు చేస్తూ గవర్నర్ నిర్ణయం తీసుకోకున్నారు. ఈ పరిణామాల తర్వాత తన ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు హేమంత్ సోరెన్ ప్రయత్నిస్తూ ఉన్నారు.
అక్రమ మైనింగ్ కేసులో ఆయన సభ్యత్వాన్ని రద్దుచేయాలన్న ఎన్నికల కమిషన్ అభిప్రాయం మేరకు గవర్నర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. కేవలం ఆయన సభ్వత్వాన్ని మాత్రమే రద్దుచేయాలని ఈసీ స్పష్టం చేయడంతో సీఎం పదవికి రాజీనామా చేసి మళ్లీ ప్రమాణస్వీకారం చేస్తారని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. ఎమ్మెల్యే సభ్వత్వం రద్దయినా రాజీనామా చేసి మళ్లీ సీఎంగా ప్రమాణం చేస్తే ఆరు నెలలు పాటు పదవిలో కొనసాగవచ్చు. ఇదే సమయంలో ఈసీ నిర్ణయాన్ని కూడా ఆయన న్యాయస్థానంలో సవాల్ చేసిన స్టే తెచ్చుకోవచ్చు.