భారత దేశంలో డిజిటల్ సేవల వినియోగం బాగా పెరిగింది. ప్రతి ఒక్కరూ స్మార్ ఫోన్ వాడుతుండటంతో ఇది మరింత సులభమైంది. స్టార్ట్‌ఫోన్ వినియోగించే ప్రతి ఒక్కరూ డిజిటల్ పేమెంట్సే చేస్తున్నారు. పెద్ద పెద్ద మాల్స్ దగ్గరి నుండి టీ కొట్టు వరకు.. ఫైవ్‌స్టార్ రెస్టారెంట్ల నుండి.. పాన్‌షాపు కొట్టుకు వరకు ఎక్కడా చూసినా డిజిటల్ పేమెంట్స్ క్యూఆర్ కోడ్‌లు కనిపిస్తున్నాయి. నగరాలు, పట్టణాలతో పాటు.. గ్రామాల్లోని షాపుల్లో సైతం డిజిటల్ పేమెంట్స్ వినియోగం బాగా పెరిగింది. దేశంలో డిజిటల్ పేమెంట్స్ ఎలా జరుగుతున్నాయన్న దానికి ఉదాహరణగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తాజాగా ఓ వీడియోను ట్విట్టర్‌లో షేర్ చేశారు.
ఈ వీడియోలో ఓ వ్యక్తి తన గంగిరెద్దుతో బిక్షాటనకు వెళ్లాడు. గంగిరెద్దు తలపై డిజిటల్ పేమెంట్ క్యూ ఆర్‌కోడ్ ట్యాగ్‌ను అమర్చాడు. దీన్ని స్కాన్ చేసిన ఓ వ్యక్తి గంగిరెద్దులాడించే వ్యక్తికి భిక్ష వేశాడు. ఇది గంగిరెద్దులాట రికార్డెడ్ వీడియో.. క్యూఆర్ కోడ్ ద్వారా ఇక్కడ భిక్ష తీసుకుంటున్నారు. భారత్‌లో డిజిటల్ పేమెంట్స్ జానపద కళాకారుల వరకూ చేరిందని వీడియోపైన నిర్మలా సీతారామన్ రాసుకొచ్చారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో గంగిరెద్దుల వారు తమ ఎద్దులను అందంగా అలంకరించి ఇంటింటికి తిరిగుతూ బిక్షాటన చేస్తుంటారు.