మహిళా ఇన్‌స్పెక్టర్‌తో డీఐజీ అనుచిత ప్ర‌వ‌ర్త‌న‌.. సీఎం సీరియ‌స్

ఒడిశాలో డీఐజీ ర్యాంకు సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి పండిట్‌ రాజేశ్‌ ఉత్తమ్‌రావు అలియాస్‌ రాజేశ్‌ పండిట్ సస్పెన్షన్‌కు గురయ్యారు.

By Medi Samrat  Published on  30 July 2024 9:49 AM GMT
మహిళా ఇన్‌స్పెక్టర్‌తో డీఐజీ అనుచిత ప్ర‌వ‌ర్త‌న‌.. సీఎం సీరియ‌స్

ఒడిశాలో డీఐజీ ర్యాంకు సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి పండిట్‌ రాజేశ్‌ ఉత్తమ్‌రావు అలియాస్‌ రాజేశ్‌ పండిట్ సస్పెన్షన్‌కు గురయ్యారు. రాజధాని పోలీస్ స్టేషన్‌కు చెందిన మహిళా ఇన్‌స్పెక్టర్‌తో డీఐజీ అనుచితంగా ప్రవర్తించారని ఆరోపణలు వచ్చాయి. దీనిపై సీరియ‌స్ అయిన‌ ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ రాజేష్ పండిట్‌పై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. హోంశాఖ మంగళవారం జారీ చేసిన ఆదేశాల మేరకు.. ఫైర్ అండ్ హోంగార్డు డీఐజీ రాజేష్ పండిట్‌పై పోలీస్ డీజీ అరుణ్ షడంగీ చర్యలు తీసుకున్నారు.

దాదాపు ఏడాది పాటు అమెరికాలో ఉన్న‌ రాజేష్ పండిట్ ఈ నెలలో భువనేశ్వర్ తిరిగి రావడం గమనార్హం. జూలై 27వ తేదీ రాత్రి ఆయ‌న‌ ఒక మహిళా ఇన్‌స్పెక్టర్ నివసించే రాజధాని పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని ప్రభుత్వ క్వార్టర్‌కు చేరుకున్నాడు. అక్క‌డ‌ రాజేష్ పండిట్ లేడీ ఇన్‌స్పెక్టర్‌ను పెళ్లి చేసుకోవాలని పట్టుబట్టడం ప్రారంభించాడు. అంతేకాదు మహిళా ఇన్‌స్పెక్టర్‌ భర్తను కూడా కొట్టారు. లేడీ ఇన్‌స్పెక్టర్ భర్త ఓ కంపెనీలో ఉన్నత హోదాలో పనిచేస్తున్నాడు.

ఐపీఎస్ రాజేష్ పండిట్ 2018లో 6 నెలల పాటు క్రైమ్ బ్రాంచ్‌లో పనిచేశారు. ఇక్కడ కూడా ఓ మహిళా ఇన్‌స్పెక్టర్‌తో ప్రేమ వ్యవహారం నడిపాడు. వీరి ప్రేమ సుమారు 6 ఏళ్లుగా సాగినట్లు పోలీసు శాఖలో చర్చ జరుగుతోంది.




Next Story