ఈ నెల 29, 30వ తేదీల్లో డీజీపీ ఆల్ ఇండియా కాన్ఫరెన్స్, కీలక సవాళ్లపై చర్చ

60వ డీజీపీ–ఐజీపీ ఆల్ ఇండియా కాన్ఫరెన్స్ ఈ నెల 29–30 నవంబర్ తేదీల్లో రాయ్‌పూర్‌లో జరగనుంది.

By -  Knakam Karthik
Published on : 27 Nov 2025 1:35 PM IST

National News, Chhattisgarh, Raipur, national DGP conference, Pm Modi, Viksit Bharat Security Dimensions

ఈ నెల 29, 30వ తేదీల్లో డీజీపీ ఆల్ ఇండియా కాన్ఫరెన్స్, కీలక సవాళ్లపై చర్చ

రాయ్‌పూర్: దేశ భద్రతా వ్యవస్థ, పోలీసింగ్ సంస్కరణలు, అంతర్గత భద్రతా సవాళ్లపై కీలక చర్చలకు వేదికగా 60వ డీజీపీ–ఐజీపీ ఆల్ ఇండియా కాన్ఫరెన్స్ ఈ నెల 29–30 నవంబర్ తేదీల్లో రాయ్‌పూర్‌లో జరగనుంది. ఈ మహాసభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొని, President’s Police Medals for Distinguished Service కూడా ప్రదానం చేయనున్నారు. చత్తీస్‌గఢ్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (IIM), రాయ్‌పూర్ లో మూడు రోజులపాటు—28 నుంచి 30 నవంబర్ వరకు—సాగే ఈ కాన్ఫరెన్స్‌కు ఈసారి ‘Viksit Bharat: Security Dimensions’ అనే థీమ్‌గా నిర్ణయించారు.

దేశవ్యాప్తంగా భద్రతా వ్యవస్థను బలోపేతం చేసే దిశగా ఇప్పటి వరకు జరిగిన పురోగతిని సమీక్షిస్తూ, ‘సురక్షిత భారత్’ నెలకొల్పడానికి అవసరమైన భవిష్యత్ రోడ్‌మ్యాప్‌పై ఈ సమావేశంలో విస్తృత చర్చలు జరుగనున్నాయి. కాన్ఫరెన్స్‌లో ముఖ్య అజెండాలుగా..లెఫ్ట్ వింగ్ ఉగ్రవాదం , కౌంటర్ టెరరిజం, డిజాస్టర్ మేనేజ్‌మెంట్, మహిళల భద్రత, ఫోరెన్సిక్ సైన్స్ & ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం లాంటివి చర్చకు రానున్నాయి.

దేశవ్యాప్తంగా ఉన్న డీజీపీలు, ఐజీపీలు, కేంద్ర పోలీస్ సంస్థల అధిపతులు ఈ వేదికలో పాల్గొనబోతున్నారు. అదనంగా, ఈసారి రాష్ట్రాలు/యుటీల హోం డిపార్ట్‌మెంట్ హెడ్స్, ఎంపిక చేసిన డీఐజీలు, ఎస్పీలు కూడా పాల్గొని తమ అభిప్రాయాలను నేరుగా ప్రధానమంత్రితో పంచుకునే అవకాశం ఉండనుంది.

2014 నుంచి ప్రధానమంత్రి మోదీ మార్గదర్శకత్వంలో ఈ కాన్ఫరెన్స్‌ విధానం మరింత సరికొత్త రూపంలో అభివృద్ధి చెందుతోంది. దేశం నలుమూలలా విభిన్న ప్రదేశాల్లో ఈ సమావేశాలు నిర్వహిస్తున్న నేపథ్యంతో—గువాహటి, రణ్ ఆఫ్ కచ్, హైదరాబాద్, టేకన్‌పూర్, స్టాచ్యూ ఆఫ్ యూనిటీ, పుణే, లక్నో, ఢిల్లీ, జైపూర్, భువనేశ్వర్ తర్వాత—ఈసారి వేదికగా రాయ్‌పూర్ నిలిచింది.

Next Story