వినాయకుడికి బంగారు కిరీటం.. ధర తెలిస్తే షాకే..!

Devotee Offers 10 kg Gold Crown to Pune's Dagdusheth Halwai Ganpati. మహారాష్ట్రలో ఓ భక్తుడు వినాయకుడి ఆలయానికి భారీ కానుక సమర్పించాడు.

By అంజి  Published on  14 Sep 2021 4:45 AM GMT
వినాయకుడికి బంగారు కిరీటం.. ధర తెలిస్తే షాకే..!

మహారాష్ట్రలో ఓ భక్తుడు వినాయకుడి ఆలయానికి భారీ కానుక సమర్పించాడు. వినాయక చతుర్థి సందర్భంగా పుణెలోని దగ్దుషెత్ హల్వాయి వినాయకుడికి 10 కిలోల బంగారు కిరీటాన్ని కానుకగా అందించాడు. ఈ కిరీటం ఖరీదు సుమారు 6 కోట్ల రూపాయల వరకు ఉంటుందని ఆలయ అధికారులు తెలిపారు. వినాయక చతుర్థి సందర్భంగా భక్తుడు సమర్పించిన ఈ బంగారు కిరీటాన్ని స్వామివారికి ఆలంకరించినట్టు ఆలయ ట్రస్ట్ అధికారులు చెప్పారు.


అయితే ఇంత పెద్ద కానుకను సమర్పించిన భక్తుడు తన పేరును వెల్లడించవద్దని కోరాడని ఆలయ అధికారులు తెలిపారు. ఈ స్వర్ణ కిరీటం ఇప్పుడు వినాయకుడి ఆలయంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రతి ఏటా దగ్దుషెత్ హల్వాయి వినాయకుడి ఆలయాన్ని లక్ష మందికిపైగా భక్తులు సందర్శిస్తారు. ఈ ఆలయంలో 128 సంవత్సరాల వినాయకుడి వేడుకలు జరుగుతున్నాయి. ఇక దేశవ్యాప్తంగా వినాయకుడి నవరాత్రి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. ప్రత్యేకంగా రూపొందించిన మంటపల్లో వినాయకుడిని ప్రతిష్టించి భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తున్నారు.

Next Story
Share it