మంగళసూత్ర యాడ్.. సబ్యసాచిపై దుమ్మెత్తి పోస్తున్న నెటిజన్లు..!
Designer sabyasachi trolled viral mangalsutra. వ్యాపారంలో రాణించాలంటే ప్రచారం చాలా అవసరం. తమ బ్రాండ్‌ను పబ్లిసిటీ చేసేందుకు కార్పొరేట్ కంపెనీలు వేల కోట్ల
By అంజి Published on 29 Oct 2021 9:51 AM GMTవ్యాపారంలో రాణించాలంటే ప్రచారం చాలా అవసరం. తమ బ్రాండ్‌ను పబ్లిసిటీ చేసేందుకు కార్పొరేట్ కంపెనీలు వేల కోట్ల రుపాయలను ఖర్చు చేస్తుంటాయి. యాడ్స్‌ను రూపొందించే విషయంలో కూడా అడ్వర్‌టైజింగ్ సంస్థలు ఎంతో జాగ్రత్త పాటిస్తాయి. అయితే అప్పుడప్పుడు అవి బెడిసికొడుతుంటాయి. అలా బెడిసి కొడితే.. అసలుకే ఎసరు వస్తుంది. ఇందుకు తాజా ఎగ్జాంపుల్ ఇంటిమేట్ జ్యూయల్లరీ యాడ్. స్టైల్ ఐకాన్‌గా పేరున్న ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ సబ్యసాచి ముఖర్జి.. తాను ఇటీవల రూపొందించిన యాడ్ క్యాంపెయిన్‌తో చిక్కుల్లో పడ్డారు. మంగళసూత్ర పేరుతో సబ్యసాచి యాడ్ రూపొందించారు. దీంతో సబ్యసాచి చేసిన పనేం బాగాలేదంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. తాజాగా రాయల్ బెంగాల్ మంగళసూత్ర పేరుతో పోస్టు చేసిన ఫొటోలు వివాదాస్పదం అయ్యాయి.
How nonsense #Sabyasachi think of for such a vulgur ads of #Mangalsutra ?
— Hiren Pawar. (@HirenPawar1) October 29, 2021
Leftists minded peoples are continuously targeting Hindu rituals & tradition by their toxic thoughts in making Ads, Pictures etc.
ऐसे "सुवरों" के लिए गाली भी छोटी पड़ेगी.
Has @ascionline notice this. pic.twitter.com/KyfEx0PKpX
ఇంటిమేట్ ఫూన్ జ్యూయల్లరీ థీమ్‌తో సబ్యసాయి ముఖర్జీ ఇటీవల యాడ్ ఫొటో షూట్ చేశారు. దీనిలో హెటిరో సెక్సువల్, సేమ్ సెక్సువల్ మోడల్స్‌ని వాడారు. అనంతరం ఆ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. దీంతో ఈ ఫొటోలు వివాదానికి కారణం అయ్యాయి. సోషల్‌మీడియాలో సబ్యసాచిపై నెటిజన్లు దుమ్మెత్తి పోస్తున్నారు. ఇది లింగరీ, కండోమ్‌కు సంబంధించిన యాడ్ కాదు కదా.. మంగళసూత్ర యాడ్‌కి ఇలాంటి ఫోటోలు అవసరం అంటూ నెటిజన్లు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు మంగళసూత్రం ప్రాముఖ్యతను తెలియజేస్తూ ట్వీట్లు చేస్తున్నారు. ట్విట్టర్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో సబ్యసాచిని ట్యాగ్ చేస్తూ.. మంగళసూత్రం ఎలా ధరించాలో ఫొటోలు పెడుతున్నారు. ఇంకొందరేమే.. జ్యూయల్లీరికి ఇలాంటి యాడ్ చేసినందుకు సిగ్గుపడాలి. ఇది మంచి పద్దతి కాదని చెబుతున్నారు.
#Mangalasutra is NOT a "tiny intimate Jewelry" to be hidden.
— 🍁 Sanatani Yoddha (@VidyaSanatani) October 27, 2021
It's Long for whole world to see.
It's PIOUS
It's PRIDE
It's Worn with Attitide (Ghamand) of being a Sanatani Hindu Woman ! pic.twitter.com/InN90Uiddp