విద్యార్థుల శీతాకాల సెలవుల నేఫథ్యంలో ఢిల్లీ పాఠశాలలు మూతపడనున్నాయి. డైరెక్టరేట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇటీవల జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం.. జనవరి 1 నుండి 15, 2022 వరకు పాఠశాలలు శీతాకాల సెలవుల నిమిత్తం మూసివేయబడతాయి. ఇటీవల నేషనల్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ కమిషన్ ఆమోదంతో.. పాఠశాలలు 6వ తరగతి నుండి భౌతిక తరగతులు నిర్వహించేలా డిసెంబర్ 18 నుంచి ప్రారంభించిన విషయం తెలిసిందే. గాలి నాణ్యత క్షీణించడంతో దేశ రాజధానిలో పాఠశాలలు మూసివేశారు.
తాజా నోటీసు ప్రకారం.. శీతాకాల సెలవుల కోసం పాఠశాలలు మూసివేస్తున్నందున ఎటువంటి ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ క్లాసులు నిర్వహించబడవని బోర్డు పేర్కొంది. విద్యార్థులకు బోధనా కార్యకలాపాలు నిర్వహించబడవు, విద్యా భారాన్ని తగ్గించడానికి, పాఠశాలలు ఇప్పటివరకు కవర్ చేయబడిన 2021-22 విద్యా సంవత్సరం సిలబస్‌ను సవరిస్తాయి. సర్వోదయ విద్యాలయ యాజమాన్యాలు సెలవుల విషయమై వారి తల్లిదండ్రుల ద్వారా విద్యార్థులకు తెలియజేయాలని పేర్కొంది. ప్రభుత్వం విడుదల చేసిన శీతాకాలపు సెలవుల అధికారిక నోటిఫికేషన్‌ను ఇక్కడ చూడవచ్చు.
ప్రస్తుతం ఢిల్లీలో మొత్తం కోవిడ్-19 కేసుల సంఖ్య 1103కి చేరింది. దేశ రాజధానిలో COVID-19 మార్గదర్శకాలతో పాఠశాలలు తిరిగి తెరవబడ్డాయి. అయితే.. పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థుల బలాలు, బలహీనతలను గమనించి.. శీతాకాల సెలవుల తర్వాత, ప్రతి విద్యార్థిపై వ్యక్తిగత శ్రద్ధ కేటాయించబడుతుందని తాజా ఉత్తర్వులలో నేర్కొంది.