ఢిల్లీలో రికార్డ్ స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. ఒక్కరోజే కొత్తగా 1,607 కోవిడ్ -19 కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో రెండు మరణాలు నమోదయ్యాయని ఆరోగ్యశాఖ అధికారులు శనివారం ఉదయం విడుదల చేసిన హెల్త్ బులిటెన్‌లో తెలిపారు. కొత్తగా నమోదైన కేసులతో కలిపి దేశ రాజధానిలో ఇప్పటివరకూ మొత్తం కేసుల సంఖ్య 18,81,555కి పెరిగింది. తాజాగా నమోదైన రెండు కోవిడ్ మరణాలతో కలిపి మొత్తం మరణాల సంఖ్య 26,174 కు చేరుకుంది. బులెటిన్ ప్రకారం రాజధాని నగరంలో కోవిడ్ మరణాల రేటు 1.39 శాతంగా ఉంది. ప్రస్తుతం ఢిల్లీలో యాక్టివ్ కేసుల సంఖ్య 5,609కి పెరిగింది. పాజిటివిటీ రేటు 5.28 శాతానికి చేరుకుంది.
గత 24 గంటల్లో 1,246 మంది రోగులు కోలుకోవడంతో.. మొత్తం కోలుకున్న వారి సంఖ్య 18,49,772కి చేరింది. హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్న కోవిడ్ రోగుల సంఖ్య కూడా 3,863కి పెరిగింది. ప్రస్తుతం ఢిల్లీ నగరంలో కోవిడ్ కంటైన్‌మెంట్ జోన్‌ల సంఖ్య 632గా ఉంది. దేశ రాజధానిలో గత 24 గంటల్లో కనీసం 60,287 వ్యాక్సిన్‌లు అందించారు. మొదటి డోస్‌గా 8,127, రెండవ డోస్ 28,315, బూస్టర్ డోస్‌గా 23,845 వ్యాక్సిన్ తీసుకున్నారు. ఇప్పటివరకూ వేసిన మొత్తం టీకాల సంఖ్య 3,34,01,239కు చేరింది.