జహంగీర్‌పురి ప్రాంతానికి చెందిన ఒక ప్రధాన ఆయుధాల స్మగ్లర్ ను ఢిల్లీ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. అతడిని పట్టుకోడానికి పోలీసులు కూడా ఫైరింగ్ చేయాల్సి వచ్చింది. కాల్పుల్లో నిందితుడికి బుల్లెట్ గాయమైంది. నిందితులపై దాదాపు అరవై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. ఆయుధాల సరఫరాదారు జహంగీర్‌పురి ప్రాంతంలో పెద్ద ఎత్తున అక్రమ ఆయుధాల రాకెట్‌ను నడిపేవాడు.
జహంగీర్‌పురిలో పెద్ద సంఖ్యలో అనధికార ఆయుధాలు ఉపయోగించారు. ఇటీవల చోటు చేసుకున్న అరెస్టుల మధ్య ఈ అరెస్టు జరిగింది. అంతకు ముందు చోటు చేసుకున్న హింసకు.. ఈ ఆయుధాల స్మగ్లర్ కు మధ్య ఉన్న సంబంధాన్ని పోలీసులు ఇంకా కనుగొనలేదు. గత శనివారం హనుమాన్ జయంతి సందర్భంగా జరిగిన ఊరేగింపులో ఇరువర్గాలు ఘర్షణకు దిగడంతో దేశ వ్యాప్తంగా ఒక్కసారిగా కలకలం రేగింది.
ఈ ప్రాంతంలో హింసను ప్రేరేపించినందుకు ఇప్పటివరకు ఇద్దరు ప్రధాన నిందితులు అన్సార్, అస్లాం మరియు ఇద్దరు బాలనేరస్థులతో సహా 25 మందిని అరెస్టు చేశారు. జహంగీర్‌పురిలో అల్లర్లకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు ఆ ప్రాంతంలో అక్రమ నిర్మాణాలు కట్టుకున్నారని.. వాటిని కూల్చివేయాలని డిమాండ్ చేస్తున్నారు.