అఫీషియల్ : ఢిల్లీ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకున్న ఆప్

Delhi MCD Election Results 2022 Live Updates. ఢిల్లీ మేయర్‌ పీఠాన్ని ఆమ్‌ ఆద్మీ పార్టీ కైవసం చేసుకుంది.

By M.S.R  Published on  7 Dec 2022 2:43 PM IST
అఫీషియల్ : ఢిల్లీ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకున్న ఆప్

ఢిల్లీ మేయర్‌ పీఠాన్ని ఆమ్‌ ఆద్మీ పార్టీ కైవసం చేసుకుంది. ఢిల్లీ మున్సిపల్ కార్పోరేషన్‌లో ఆప్‌ 136 వార్డుల్లో గెలిచి మ్యాజిక్‌ ఫిగర్‌ను దాటేసింది. గత 15 సంవత్సరాలుగా ఢిల్లీ కార్పోరేషన్‌ లో బీజేపీదే ఆధిపత్యం. వరుసగా మూడు పర్యాయాలు మేయర్‌ పీఠం దక్కించుకున్న బీజేపీ.. ప్రస్తుతం అందిన సమాచారం ప్రకారం 100 వార్డుల్లో విజయం సాధించింది. స్వతంత్ర అభ్యర్థులు మూడు వార్డుల్లో విజయం సాధించారు. ఢిల్లీలో తమ ప్రభుత్వమే ఉన్నా, ఢిల్లీ కార్పోరేషన్‌ బీజేపీ చేతిలో ఉండటంతో తమకు ఢిల్లీని క్లీన్‌ చేసే అవకాశం లేకుండా పోయిందని ఆప్ చీఫ్ ఢిల్లీ ఓటర్లకు చెబుతూ వచ్చిన సంగతి తెలిసిందే..! దీంతో ఢిల్లీ మేయర్‌ పీఠాన్ని ఆప్‌ చేతుల్లో పెట్టారు ఓటర్లు.

మునిసిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ (MCD) ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) విజయం సాధించడంతో, బుధవారం న్యూఢిల్లీలోని ఆప్ కార్యాలయంలో సందడి వాతావరణం నెలకొంది. ఆప్ మద్దతుదారులు పార్టీ జెండాలను పట్టుకుని మిఠాయిలు పంచుతూ, డప్పుల దరువులతో నృత్యాలు చేస్తూ సంబరాలు ప్రారంభించారు. AAP 136 వార్డులలో విజయం సాధించింది, అయితే BJP 100 కైవసం చేసుకుంది. తాజా కౌంటింగ్ ట్రెండ్స్ ప్రకారం, కాంగ్రెస్ పది వార్డులను గెలుచుకుని మూడవ స్థానంలో ఉంది.


Next Story