క్రికెట్ బ్యాట్‌తో కుక్కపై విరుచుకుపడ్డాడు.. సీసీటీవీ కెమెరాల్లో మొత్తం రికార్డు

మూగజీవాలపై అనవసరంగా దాడి చేస్తున్న ఘటనలు మనం చాలానే చూశాం. అలాంటి ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  4 May 2023 5:07 PM IST
Delhi , stray dog,  crime news

క్రికెట్ బ్యాట్‌తో కుక్కపై విరుచుకుపడ్డాడు.. సీసీటీవీ కెమెరాల్లో మొత్తం రికార్డు

మూగజీవాలపై అనవసరంగా దాడి చేస్తున్న ఘటనలు మనం చాలానే చూశాం. అలాంటి ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. సౌత్ ఈస్ట్ ఢిల్లీలోని సన్‌లైట్ కాలనీలో తేదీ లేని వీడియోలో ఒక వ్యక్తి వీధి కుక్కను క్రికెట్ బ్యాట్‌తో కొట్టడం కనిపించింది. ఈ ఘటన మొత్తం సీసీటీవీలో రికార్డయింది.

బ్యాట్ తో దెబ్బలు తగిలాక తర్వాత కుక్క అపస్మారక స్థితికి చేరుకుంది. అయితే స్పృహలోకి వచ్చి ప్రస్తుతం చికిత్స పొందుతోంది. ఈ ఘటనపై జంతు సంరక్షణ కార్యకర్తలు సన్‌లైట్‌ కాలనీ పోలీస్‌ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. ఇలా మూగజీవాలపై కావాలనే దాడులు చేస్తూ ఉండడం.. శిక్షలు తక్కువ ఉండడంపై కూడా జంతు సంరక్షణ కార్యకర్తలు ఎప్పటి నుండో తమ వాయిస్ ను వినిపిస్తూ ఉన్నారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

Next Story