ఢిల్లీలో మాస్కులు ధరించడం మళ్లీ తప్పనిసరి చేస్తూ ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ (DDMA) ఏప్రిల్ 20 బుధవారం ప్రకటించింది. నిబంధనలు ఉల్లంఘించిన వారు రూ.500 జరిమానా చెల్లించాల్సి ఉంటుందని డీడీఎంఏ ప్రజలకు హెచ్చరికలు జారీచేసింది. ఢిల్లీలో కోవిడ్ కేసుల పెరుగుదల కారణంగా అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని పరిపాలన విభాగం కొత్త విధానాలను విడుదల చేసింది. ఢిల్లీలో మంగళవారం 632 రోజువారీ కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. ఫిబ్రవరి 17 నుండి స్థిరంగా ఉన్న కేసులు ఒక్కసారిగా పెరిగాయి. శనివారం నగరంలో 461 కేసులు నమోదు కాగా.. ఆది, సోమవారాల్లో 500కు పైగా కేసులు నమోదయ్యాయి.
ఈ నేఫథ్యంలో ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది. కేసుల పెరుగుదల నేఫధ్యంలో అప్రమత్తంగా ఉండాలని సూచిస్తూనే, భయాందోళనలకు గురికావద్దని ఢిల్లీ ప్రభుత్వ యంత్రాంగం ప్రజలను కోరింది. ఇదిలావుంటే.. మంగళవారం దేశవ్యాప్తంగా కోవిడ్ కేసులు గణనీయంగా తగ్గాయి. బుధవారం నాడు 2,067 కొత్త కేసుల నమోదవడంతో సంఖ్య పెరిగింది. సోమవారం, 2,183 ఇన్ఫెక్షన్లు నమోదయ్యాయి, మంగళవారం నాడు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ 1,247 కేసులు నమోదయినట్లు తెలిపింది.