విపక్ష కూటమి 'I-N-D-I-A'కు షాక్.. పేరు వాడటంపై ఢిల్లీ హైకోర్టు నోటీసులు
Delhi High Court Issues Notice On PIL Against Use Of Acronym ‘INDIA’ By Opposition Parties. విపక్షాలు తమ కూటమికి 'I.N.D.I.A' అనే పదాన్ని ఉపయోగించకుండా నిరోధించాలని
By Medi Samrat
విపక్షాలు తమ కూటమికి 'I.N.D.I.A' అనే పదాన్ని ఉపయోగించకుండా నిరోధించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు శుక్రవారం కేంద్రం, భారత ఎన్నికల సంఘం, 26 రాజకీయ పార్టీల ప్రతిస్పందనను కోరింది.
2024 లోక్‌సభ ఎన్నికల్లో అధికార ఎన్‌డిఎపై పోటీ చేసేందుకు 26-పార్టీ ప్రతిపక్షపార్టీల కూటమి (భారత జాతీయ అభివృద్ధి సమ్మిళిత కూటమి)ని 17-18 జూలైలో కర్ణాటకలోని బెంగళూరులో జరిగిన సమావేశంలో ప్రకటించారు.
ప్రధాన న్యాయమూర్తి సతీష్ చంద్ర శర్మ, జస్టిస్ అమిత్ మహాజన్‌లతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌పై విచారణ జరగాల్సి ఉందని పేర్కొంటూ హోం మంత్రిత్వ శాఖ, సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ, ఈసీ, 26 రాజకీయ పార్టీలకు నోటీసులు జారీ చేసింది. పిటీషన్‌పై వాదనలు వింటామన్న హైకోర్టు ధర్మాసనం.. ఈ దశలో ఎలాంటి మధ్యంతర ఉపశమనాన్ని ఇవ్వడానికి నిరాకరించింది. పిటీషనర్ తక్షణ ఉపశమనం కోరగా.. మేము ఇలాంటి ఉత్తర్వులు ఇవ్వలేము. అటువైపు రియాక్షన్ రానివ్వండి. మేము దానిని ఖచ్చితంగా పరిశీలిస్తామని పేర్కోంది.
గిరీష్ భరద్వాజ్ అనే వ్యక్తి న్యాయవాది వైభవ్ సింగ్ ద్వారా దాఖలు చేసిన పిటిషన్‌లో.. భారతీయ జనతా పార్టీ (బిజెపి) నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్‌డిఎ)కి వ్యతిరేకంగా 2024 ఎన్నికల్లో కలిసి పోరాడతామని విపక్ష పార్టీలు చెబుతున్నాయి. రాజకీయ పార్టీలు 'I.N.D.I.A' అనే సంక్షిప్త పదాన్ని ఉపయోగించకుండా నిషేధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని.. ప్రతివాద రాజకీయ కూటమిని 'I.N.D.I.A' అనే మారుపేరుతో కూడిన జాతీయ జెండాను ఉపయోగించకుండా నిరోధించాలని పిటిషన్ కోరారు.
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ వ్యాఖ్యలను పిటిషన్‌లో ప్రస్తావించారు. రాహుల్ గాంధీ చాలా తెలివిగా తన కూటమి పేరును మన దేశం పేరుగా ప్రదర్శించారు. NDA/BJP ద్వారా నరేంద్ర మోదీ భారత దేశం.. మన స్వంత దేశం అని చూపించడానికి ప్రయత్నించారు. 'I.N.D.I.A'తో భారతదేశం వైరుధ్యంలో ఉంది. రాహుల్ గాంధీ ప్రయత్నం 2024 రాబోయే ఎన్నికలలో రాజకీయ పార్టీల మధ్య లేదా కూటమికి మన మధ్య జరిగే పోరు అని సామాన్య ప్రజల మనస్సులలో గందరగోళాన్ని సృష్టించవచ్చని పేర్కొన్నారు.