వాటిని అడ్డుకుంటే ఉరి తీస్తామని వార్నింగ్ ఇచ్చిన హై కోర్టు
Delhi HC warns of criminal action. ఆక్సిజన్ సరఫరా విషయంలో కొన్ని ప్రాంతాల్లో రాజకీయాలు జరుగుతూ ఉన్నాయి. బ్లాక్ మార్కెట్ కు
By Medi Samrat Published on 24 April 2021 5:14 PM ISTఆక్సిజన్ సరఫరా విషయంలో కొన్ని ప్రాంతాల్లో రాజకీయాలు జరుగుతూ ఉన్నాయి. బ్లాక్ మార్కెట్ కు సిలిండర్లను తరలించి సొమ్ము చేసుకుంటూ ఉన్నారనే విషయాలు కూడా బయటకు వస్తూ ఉన్నాయి. దేశం ఇలాంటి పరిస్థితుల్లో ఉండగా.. ఆక్సిజన్ టాంకర్ల విషయమై ఇలాంటి పనులు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలనే డిమాండ్ పెద్ద ఎత్తున ఉంది. ఇక ఆక్సిజన్ సరఫరాను అడ్డుకునే వారిని ఉరి తీస్తామంటూ ఢిల్లీ హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఆక్సిజన్ కొరతపై ఢిల్లీలోని ఓ ఆసుపత్రి వేసిన పిటిషన్ ను విచారించిన ఢిల్లీ హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. తమకు 480 టన్నుల ఆక్సిజన్ ఇవ్వకపోతే పరిస్థితి మొత్తం చేజారిపోతుందని ఢిల్లీ ప్రభుత్వమూ కోర్టుకు వివరించింది. ఈ నేపథ్యంలోనే పొరుగు రాష్ట్రాలకు చెందిన కొందరు అధికారులు తరలిస్తున్న ఆక్సిజన్ అడ్డుకుంటున్నారని కోర్టు దృష్టికి తీసుకొచ్చింది.ఎవరు అడ్డుకుంటున్నారో ఒక్క ఉదాహరణ చెప్పండి. ఎవ్వరైనా మేం వదిలిపెట్టం. ఆ అడ్డుకున్న వ్యక్తిని ఉరి తీస్తామని హైకోర్టు చెబుతోంది. అలాంటి అధికారులపై కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేయాలని ఢిల్లీ సర్కారును ఆదేశించింది. ఇది సెకండ్ వేవ్ కాదని.. పెద్ద సునామీ అని హైకోర్టు చెప్పుకొచ్చింది.
ఆక్సిజన్ కొరత తీర్చేందుకు కేంద్ర సర్కారు విఫలమవుతోన్న తీరుపై ఢిల్లీ హై కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ విషయంలో కేంద్ర సర్కారు మరిన్ని కఠిన చర్యలు తీసుకోవాలని కోర్టు సూచించింది. ఢిల్లీలో ఇప్పటివరకు ఆక్సిజన్ ప్లాంట్ ఎందుకు ఏర్పాటు చేయలేదని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. సొంతంగా ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని ఢిల్లీ ప్రభుత్వాన్ని న్యాయస్థానం ఆదేశించింది. రోగులకు ఆక్సిజన్‌ను అందించకపోవడం అనేది నేరపూరిత చర్య అని పేర్కొంది. జీవించడం ప్రజల ప్రాథమిక హక్కు అని గుర్తు చేసింది. ఆక్సిజన్ సరఫరాకు ఎవరైనా ఆటంకాలు కలిగిస్తే క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.