మహిళా సమ్మాన్ యోజన ప్రారంభం.. ఇకపై మహిళల బ్యాంకు ఖాతాల్లో ప్రతి నెలా రూ. 2500 జమ
ఢిల్లీ ప్రభుత్వం రెండవ క్యాబినెట్ సమావేశం శనివారం జరిగింది. ఇందులో ప్రతి నెలా మహిళలకు 2500 రూపాయలు అందించే మహిళా సమృద్ధి యోజన ప్రారంభంపై కీలక నిర్ణయం తీసుకున్నారు.
By Medi Samrat
ఢిల్లీ ప్రభుత్వం రెండవ క్యాబినెట్ సమావేశం శనివారం జరిగింది. ఇందులో ప్రతి నెలా మహిళలకు 2500 రూపాయలు అందించే మహిళా సమృద్ధి యోజన ప్రారంభంపై కీలక నిర్ణయం తీసుకున్నారు. అనంతరం జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో ఢిల్లీ ప్రదేశ్ మహిళా మోర్చా ఆధ్వర్యంలో నిర్వహించిన మహిళా దినోత్సవ కార్యక్రమంలో ఈ విషయాన్ని ప్రకటించారు. ఈ పథకం ప్రయోజనాలను పొందేందుకు మహిళల రిజిస్ట్రేషన్ ప్రారంభమవుతుంది. మహిళల ప్రయోజనాల కోసం ఇతర ప్రకటనలు కూడా చేశారు.
ఢిల్లీ ప్రభుత్వ కేబినెట్ సమావేశంలో మహిళా సమృద్ధి యోజన కోసం రూ.5,100 కోట్లకు ఆమోదం తెలిపినట్లు జేపీ నడ్డా తెలిపారు. మహిళా సమృద్ధి యోజనను తీసుకువస్తామని ప్రధానమంత్రి హామీ ఇచ్చారని కేంద్రమంత్రి నడ్డా తెలిపారు. ఈ మేరకు తీర్మాన లేఖలో హామీ కూడా ఇచ్చారు. రేఖా గుప్తా ప్రభుత్వ మంత్రివర్గం ఇందుకోసం రూ.5,100 కోట్లు కేటాయించింది. మహిళా సాధికారత పనులు ప్రారంభమయ్యాయి.
మహిళా సమృద్ధి యోజన కోసం రూ.5100 కోట్ల బడ్జెట్ కేటాయింపు జరిగిందని ముఖ్యమంత్రి రేఖా గుప్తా తెలిపారు. ఆశిష్ సూద్, ప్రవేశ్ వర్మ, కపిల్ మిశ్రాతో ఒక కూడిన కమిటీని రూపురేఖలు సిద్ధం చేసేందుకు ముఖ్యమంత్రి అధ్యక్షతన ఏర్పాటు చేశారు. ఢిల్లీ ప్రభుత్వ రెండో కేబినెట్ సమావేశంలో మహిళలకు నెలకు రూ.2500 ఇచ్చే మహిళా సమృద్ధి యోజనకు ఆమోదం లభించింది. అయితే.. విధివిధానాలు రూపొంది.. మహిళల బ్యాంకు ఖాతాల్లోకి డబ్బులు జమ చేసేందుకు కొంత సమయం పట్టనున్నట్లు తెలుస్తుంది.
సభను ఉద్దేశించి బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా మాట్లాడుతూ.. ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో మహిళలు ఎంతో కృషి చేశారని అన్నారు. ఢిల్లీ మహిళలు లేకుంటే బీజేపీ గెలుపు సాధ్యం కాదన్నారు. మహిళల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించకపోతే వికసిత్ భారత్ సాధ్యం కాదు అన్నారు. రానున్న కాలంలో 33 శాతం మంది మహిళలు లోక్‌సభ సభ్యులు అవుతారని నడ్డా చెప్పారు. మహిళలను గౌరవించని దేశం ఎప్పటికీ అభివృద్ధి చెందదు.
స్టేడియంలో మహిళలను ఉద్దేశించి ముఖ్యమంత్రి రేఖా గుప్తా మాట్లాడుతూ.. ఈరోజు ఈ ఆడిటోరియంకు వచ్చినప్పుడు చాలా ఉద్వేగానికి లోనయ్యాను. ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా ఇదే అతిపెద్ద గౌరవం.. ఢిల్లీకి మహిళను ముఖ్యమంత్రిని చేశారు. విద్య, భద్రత, శ్రేయస్సు కోసం అన్ని విధాలా కృషి చేస్తానని, నా సోదరీమణుల భద్రత నా బాధ్యత అని, ఢిల్లీ అభివృద్ధికి ఆరోగ్యం, ఇతర పనులకు రోడ్‌మ్యాప్‌ను సిద్ధం చేశామని సీఎం చెప్పారు.