ఢిల్లీ ప్రభుత్వం మార్చి 8న మహిళా సమ్మాన్ యోజనను ప్రారంభించనున్నట్లు తెలుస్తుంది. మార్చి 8న మహిళల ఖాతాల్లో రూ.2500 జమ చేయనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. కేంద్ర మంత్రి జేపీ నడ్డా సమక్షంలో మహిళా సమ్మాన్ యోజన ప్రారంభించనున్నట్లు సమాచారం.
మూలాల ప్రకారం.. ఈ పథకం నిబంధనలు, షరతులు రాబోయే రోజుల్లో అధికారికంగా అమలు చేయబడతాయి. అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున జేపీ నడ్డా సమక్షంలో సభ నిర్వహించి మహిళల సమక్షంలో దీన్ని ప్రారంభించనున్నారు.
హోలీకి ముందు మహిళలకు రూ.2500 ఇస్తామని ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా హామీ ఇచ్చారు. మహిళలకు ప్రతినెలా రూ.2500 అందజేస్తామన్న హామీని బీజేపీ ప్రభుత్వం నెరవేరుస్తుందని ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా ఇటీవల హామీ ఇవ్వడం గమనార్హం. ప్రమాణ స్వీకారోత్సవానికి రాంలీలా మైదాన్‌కు బయలుదేరే ముందు ఆమె తన నివాసం వెలుపల విలేకరులతో మాట్లాడుతూ ఈ విషయం చెప్పారు.