బీజేపీ గెలవడానికి సహాయం చేసిన మజ్లీస్ పార్టీ.. ఎలాగంటే.?

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (AIMIM) ఖాతా తెరవడంలో విఫలమైంది.

By Medi Samrat  Published on  8 Feb 2025 7:15 PM IST
బీజేపీ గెలవడానికి సహాయం చేసిన మజ్లీస్ పార్టీ.. ఎలాగంటే.?

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (AIMIM) ఖాతా తెరవడంలో విఫలమైంది. అయితే ఆ పార్టీ ముస్తఫాబాద్ సీటు అభ్యర్థి తాహిర్ హుస్సేన్ బీజేపీ గెలవడానికి తగినన్ని ఓట్లను చీల్చడంలో సహాయపడ్డాడు. భారతీయ జనతా పార్టీ (బిజెపి) గెలుపును సొంతం చేసుకుంది ఈ స్థానంలో. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ౧౭,000 ఓట్ల తేడాతో ఈ సీటులో ఓడిపోయింది.

ఎన్నికల కమిషన్ గణాంకాల ప్రకారం, బీజేపీకి చెందిన మోహన్ సింగ్ బిష్త్ 85,215 ఓట్లు సాధించి విజయం సాధించారు. ఆప్‌కి చెందిన అదీల్ అహ్మద్ ఖాన్ 67637 ఓట్లతో రెండవ స్థానంలో నిలిచారు. AIMIM అభ్యర్థి 33474 ఓట్లను సాధించి మూడవ స్థానంలో నిలిచారు, AIMIM ఎన్నికల్లో పోటీ చేయకపోతే, AAP అభ్యర్థి విజయం సాధించేవారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. AIMIM అభ్యర్థి తాహిర్ హుస్సేన్‌ పై 2020 ఢిల్లీ అల్లర్ల కేసులో నిందితుడిగా ఆరోపణలు వచ్చాయి. 2025 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో, AIMIM కేవలం ఓఖ్లా, ముస్తఫాబాద్ - రెండు స్థానాల్లో మాత్రమే పోటీ చేసింది. రెండింటిలోనూ ఓడిపోయింది.

Next Story