మరిన్ని సడలింపులు.. ప్రకటించిన సీఎం

Delhi Eases Curbs From Tomorrow. కరోనా కేసులు త‌గ్గుముఖం ప‌డుతున్న నేఫ‌థ్యంలో ఢిల్లీ ముఖ్య‌మంత్రి కేజ్రీవాల్ మరిన్ని సడలింపుల‌ను

By Medi Samrat
Published on : 13 Jun 2021 2:07 PM IST

మరిన్ని సడలింపులు.. ప్రకటించిన సీఎం

కరోనా కేసులు త‌గ్గుముఖం ప‌డుతున్న నేఫ‌థ్యంలో ఢిల్లీ ముఖ్య‌మంత్రి కేజ్రీవాల్ మరిన్ని సడలింపుల‌ను ప్ర‌క‌టించారు. ప్ర‌స్తుతం షాపుల‌ను సరి–బేసి విధానంలో తెరుస్తుండ‌గా.. రేపటి నుంచి వారంలో ఏడు రోజులూ షాపులను తెరిచేందుకు కేజ్రీవాల్ ప్రభుత్వం అనుమతినిచ్చింది. అయితే.. దుకాణాల‌ వేళలు ఇప్పుడున్నట్టే ఉదయం 10 నుంచి రాత్రి 8 గంటల వరకుంటాయని.. ఓ వారం చూశాక క‌రోనా కేసుల‌ త‌గ్గుద‌ల క‌నిపిస్తే.. తదుపరి సడలింపులు ఇస్తామని కేజ్రీవాల్‌ తెలిపారు.

ఇక రెస్టారెంట్లకు ప్ర‌స్తుతం పార్సిళ్ల‌కే ప‌ర్మిష‌న్ ఉండ‌గా.. 50 శాతం సామర్థ్యంతో నడిపేందుకు అనుమ‌తి ఇచ్చారు. అలాగే.. వారాంతపు సంతలనూ సగం సామర్థ్యంతో అనుమతించనున్నట్టు ప్రకటించారు. అయితే.. ఒక్కో మున్సిపల్ జోన్ లో రోజుకు ఒక సంత మాత్రమే జరగాలన్నారు. ప్రభుత్వ కార్యాలయాలు పూర్తి సామర్థ్యంతో ప‌నిచేయ‌నుండ‌గా.. ప్రైవేట్ ఆఫీసులు మాత్రం సగం సామర్థ్యంతోనే తెరుచుకోవాల‌ని సూచించారు. స్కూళ్లు, కాలేజీలు పూర్తిగా మూసే ఉంటాయ‌ని.. గుళ్లు, ప్రార్థనా మందిరాలను తెరిచినా భక్తులకు మాత్రం అనుమతి ఉండదన్నారు. మెట్రో రైళ్లు, బస్సులు 50 శాతం సామర్థ్యంతోనే ట్రిప్పులు వేస్తాయన్నారు.


Next Story