ఆ మాజీ ముఖ్యమంత్రికి నాలుగేళ్ల జైలు శిక్ష

Delhi court sentences ex-Haryana CM Om Prakash Chautala to 4 years’ imprisonment. హ‌ర్యానా మాజీ సీఎం, ఇండియ‌న్ లోక్ ద‌ళ్ మాజీ అధ్య‌క్షుడు ఓం ప్రకాశ్ చౌతాలాకు

By Medi Samrat  Published on  27 May 2022 11:39 AM GMT
ఆ మాజీ ముఖ్యమంత్రికి నాలుగేళ్ల జైలు శిక్ష

హ‌ర్యానా మాజీ సీఎం, ఇండియ‌న్ లోక్ ద‌ళ్ మాజీ అధ్య‌క్షుడు ఓం ప్రకాశ్ చౌతాలాకు ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో నాలుగేళ్ల జైలు శిక్ష ఖ‌రారైంది. ఈ శిక్ష‌తో పాటు ఆయ‌న‌కు రూ.50 ల‌క్ష‌ల జ‌రిమానాను విధిస్తూ ఢిల్లీ కోర్టు శుక్ర‌వారం మ‌ధ్యాహ్నం సంచ‌ల‌న తీర్పు వెలువ‌రించింది. ఈ కేసులో చౌతాలాకు చెందిన నాలుగు ఆస్తుల‌ను కూడా స్వాధీనం చేసుకోవాల‌ని కోర్టు అధికార యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేసింది.

హ‌ర్యానాలో అర్హ‌త లేని వారిని ఉపాధ్యాయులుగా నియ‌మించార‌న్న కేసులో ఇప్ప‌టికే దోషిగా తేలి ప‌దేళ్ల పాటు జైలు జీవితం గ‌డిపి ఏడాది క్రిత‌మే చౌతాలా విడుద‌ల‌య్యారు. ఆయ‌న‌పై దాఖ‌లైన ఆదాయానికి మించి ఆస్తులు కూడ‌బెట్టార‌న్న కేసులోనూ విచార‌ణ వేగం పుంజుకుంది. విచార‌ణ‌ను ముగించిన కోర్టు చౌతాలాను దోషిగా తేల్చగా.. శుక్ర‌వారం ఈ కేసులో చౌతాలాకు శిక్ష ఖ‌రారు చేస్తూ కోర్టు తీర్పు చెప్పింది.







Next Story