ఢిల్లీ లోని దయాల్‌పూర్ ప్రాంతంలో గురువారం సాయంత్రం పోలీసుపై ఎద్దు దాడి చేసింది. దయాల్‌పూర్‌లోని షేర్‌పూర్ చౌక్‌లో కానిస్టేబుల్ జ్ఞాన్‌సింగ్ విధులు నిర్వహిస్తుండగా ఈ ఘటన జరిగింది. ఎద్దు కానిస్టేబుల్‌పై వెనుక నుంచి దూసుకు రావడంతో ఆయన కాస్తా గాలిలోకి ఎగిరి కింద పడ్డారు. అతను నేలపై పడిపోయిన తర్వాత, విధుల్లో ఉన్న ఇతర పోలీసులు అతన్ని ఆసుపత్రికి తరలించారు. సింగ్ ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యారని పోలీసులు తెలిపారు. ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
డ్యూటీలో ఉన్న పోలీసు ఆఫీసర్.. ఇంతలో..గతేడాది గుజరాత్‌లోని భావ్‌నగర్‌లో కూడా ఓ వ్యక్తిపై ఎద్దు దాడి చేసింది. దారితప్పిన ఎద్దులను, ఆవులను రోడ్డుపై నుంచి తొలగించేందుకు మా శక్తి మేరకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని, గతేడాది 2,300 ఎద్దులను పట్టుకుని వివిధ గోశాలలకు అప్పగించామని భావ్‌నగర్ మేయర్ కీర్తి డానిధారియా అన్నారు. ఈ ఏడాది 600 ఎద్దులను పట్టుకున్నామని కీర్తి డానిధారియా అన్నారు.